వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో బాబు... చర్చకు వచ్చిన అంశాలివే!!

ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణం ఇప్పించేందుకు సహకరిస్తామని ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-20 16:54 GMT

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు చంద్రబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా ఏపీలో ‘ఏ’ అంటే అమరావతి, ‘పీ’ అంటే పోలవరం అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణం ఇప్పించేందుకు సహకరిస్తామని ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో... కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసినట్లు కథనాలొచ్చిన సంగతీ తెలిసిందే. ఇందులో భాగంగా... ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)తో కలిసి ఈ మొత్తాని అమరావతి కోసం మంజూరు చేయనుందన్ని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు బాబుతో భేటీ అయ్యారు.

అవును... మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణం సమకూర్చనున్న నేపథ్యంలో ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు ఈ నెల 27 వరకూ అమరావతిలో పర్యటించనున్నారు. ఈ సమయంలో.. పురపాలకశాఖ మంత్రి నారాయణతో పాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఉన్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతి అభివృద్ధి, ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పర్యటనలో భాగంగా... సీఆర్డీయే అధికారులతోనూ చర్చించనుంది ఈ ప్రతినిధుల బృందం. దీంతో... అమరావతి నిర్మాణానికి కేంద్రం ప్రకటించినట్లుగా రూ.15 వేల కోట్ల రుణానికి లైన్ ఆల్ మోస్ట్ క్లియర్ అయినట్లేననే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అన్నీ అనుకూలంగా జరిగితే ఈ విషయంపై ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధుల నుంచి త్వరలో గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా.. ఈ నెల 10 నుంచి 12 వ తేదీ వరకూ ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ కు చెందిన నలుగురు ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటించి.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన సంగతి తెలిసిందే.

కాగా... 2019కి ముందే అమరవతి నిర్మాణానికి ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఈఈఇబీ) తో కలిసి తొలి విడతలో రూ.3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందుకు అవసరమైన ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రభుత్వం మారింది. దీంతో... ఈ రుణం వ్యవహారం నిలిచిపోయిందని అంటారు!

Tags:    

Similar News