మంత్రిగారి ఎన్నికల ముచ్చట.. ఏదో ఒకటి తేల్చేయాలని వేడుకోలు..!
మంత్రికి ఎన్నికల బెంగ పట్టుకుందని ఆయన గురించి అంతో ఇంతో తెలిసిన వారు చెబుతున్నారు
వైసీపీలో మంత్రిగారి ఎన్నికల ముచ్చట ఆసక్తిగా మారింది. ఆయన ఇటు పార్టీలోనూ.. అటు నియోజకవ ర్గంలోనూ.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఉన్నత విద్యావంతుడు అయిన.. సదరు మంత్రి వర్యులు.. గత ఎన్నికల్లో గుంటూరు ఎస్సీ స్థానం వేమూరు నుంచి విజయం దక్కించుకున్నారు. ఆయనే మేరుగ నాగార్జున. రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో ఎస్సీ కోటా లో మంత్రిపదవిని సొంతం చేసుకున్నారు.
అయితే.. ఇప్పుడు సదరు మంత్రికి ఎన్నికల బెంగ పట్టుకుందని ఆయన గురించి అంతో ఇంతో తెలిసిన వారు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇది బెంగ కాదు.. ముచ్చట అంటున్నారు. అప్పుడప్పుడు.. వి షయంతో సంబంధం లేకుండా.. తన శాఖతోనూ సంబంధం లేకుండా మీడియా ముందుకు వచ్చి కామెం ట్లు చేసే నాగార్జున కు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీకి పెడతారనేది చర్చగా మారింది. కొన్నాళ్లుగా ఆయనను ఈసారి నియోజకవర్గం నుంచి మార్పు చేయడం తథ్యమని అంటున్నారు.
దీనిపై వైసీపీ అధిష్టానం కూడా.. నిశితంగా గమనిస్తున్నదనే టాక్ కూడా వినిపిస్తోంది. వేమూరులో రాజకీ యం ఇప్పుడు వేడిక్కిందని.. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హవా పెరిగిందని వైసీపీ నాయకులే.. స్థా నికంగా ఉన్న పరిస్థితిని చూసి ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. దీనికితోడు.. నాగార్జునకు సొంత కేడర్‌లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోందని లోకల్‌గా చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను ఇక్కడ నుంచి వేరే నియోజకవర్గానికి మారుస్తారని అంటున్నారు.
ప్రత్తిపాడు నుంచి పోటీ చేయించే అవకాశం ఉంటుందని వైసీపీలో చర్చసాగుతోంది. అయితే.. దీనిపై పార్టీ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే మంత్రిగారి ఎన్నికల ముచ్చటగా మారిపోయింది. ''ఏదో ఒకటి తేల్చేస్తే.. నేను ప్రజల్లోకి వెళ్తా. ప్రస్తుతం ఇక్కడ నేలబారు(ఇంటింటికీ) తిరుగుతున్నా. రేపు ఇక్కడ కాదంటే.. అటు పోవాలి. మరి ఇక్కడ పడిన కష్టం.. చేసిన ఖర్చు.. మాటేంటి? అందుకే ఏదో ఒకటి తేల్చేస్తే.. బెటర్'' అని మంత్రి వర్యులు ఎదురు చూస్తున్నారు. మరి మంత్రి వర్యుల ఎన్నికల ముచ్చట ఎప్పటికి తీరుతుందో చూడాలి.