మెక్సికో పార్లమెంటులో గ్రహాంతరవాసులు...నాసా రియాక్షన్ వైరల్!

అవును... మెక్సికో పార్లమెంటు సమావేశాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే

Update: 2023-09-15 06:16 GMT

ఈ విశ్వంలో గ్రహాంతరవాసులు ఉన్నారా.. లేదా.. అనే చర్చ దశాబ్ధాలుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏలియన్లు నిజంగానే ఉన్నాయంటూ మెక్సికో శాస్త్రవేత్తలు ఆ దేశ పార్లమెంట్‌ లో రుజువుచేసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా నాసా స్పందించింది. ఇందులో భాగంగా 33 పేజీల సంచలన నివేదికను బయటపెట్టింది!

అవును... మెక్సికో పార్లమెంటు సమావేశాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మానవేతర అవశేషాలుగా పేర్కొంటూ రెండు వింత ఆకారాలను ఏకంగా చట్టసభలోనే ప్రదర్శించారు! అలాగే.. తమ పరిశోధనల్లో వెలుగుచూసిన అంశాలను చట్టసభ్యులకు నివేదించారు. ఈ క్రమంలో తాజా పరిణామంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ స్పందించింది.

భూమి మీద మనుషులు, ఇతర జీవజాలం ఉన్నట్లే విశ్వంలో ఇతర బుద్ధి జీవులు లేదా గ్రహాంతరవాసులు ఉన్నారని తాము బలంగా విశ్వసిస్తోన్నామని నాసా అధినేత బిల్ నెల్సన్ నివేదికను విడుదల చేశారు. ఇదే క్రమంలో... మెక్సికో పార్లమెంట్‌ ఏలియన్ల బాడీ వ్యవహారంలో పాదర్శకత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో భూమి మీద మనుషులు, ఇతర జీవజాలం ఉన్నట్లే విశ్వంలో ఇతర బుద్ధి జీవులు ఉన్నారని తాము బలంగా విశ్వసిస్తోన్నామని బిల్ నెల్సన్ తేల్చి చెప్పారు. ఏలియన్స్ మనుగడ సాగిస్తున్నాయనే విషయాన్ని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ అనంత విశ్వంలో మనుషులు మాత్రమే జీవిస్తున్నారనే నిర్ధారణకు రాలేకపోతున్నామని అన్నారు.

అదేవిధంగా... యూ.ఎఫ్.ఓ./యూఏపీ గురించి తమ వద్ద కొన్ని కీలక డాక్యుమెంట్లు, వీడియోలు ఉన్నాయని.. అయితే వాటిని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలుగా పరిగణించట్లేదని చెప్పిన బిల్ నెల్సన్... వాటిపై స్థిరమైన, వివరణాత్మక పరిశోధనలు లేకపోవడం వల్ల యూఏపీల గురించి ఖచ్చితమైన, శాస్త్రీయ నిర్ధారణలకు రాలేకపోతున్నామని అన్నారు.

ఈ సందర్హంగా... ప్రిన్స్‌ టన్‌ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్‌ విభాగానికి మాజీ అధిపతి, ప్రస్తుతం యూఏపీకి అధ్యక్షత వహిస్తున్న డేవిడ్‌ స్పెర్‌ గెల్‌ స్పందించారు. "ఇది ట్విటర్‌ లోనే నేను చూశాను. వాటి గురించి మా వద్ద ఎలాంటి సమాచారం లేదు. అయితే.. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. మీ దగ్గర అసాధారణమైనవి కనిపించినప్పుడు.. అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటపెట్టాలి. వాటికి సంబంధించిన శాంపిల్స్‌ ని శాస్త్రీయ సమాజానికి అందుబాటులో ఉంచాలి" అని మెక్సికన్‌ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు!

కాగా... మెక్సికో పార్లమెంటు సమావేశాల్లో తాజాగా అరుదైన పరిణామం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా భావిస్తున్న రెండు వింత ఆకారాలను కొందరు పరిశోధకులు పార్లమెంటుకు తీసుకొచ్చారు. చట్టసభ్యుల ముందు వాటిని ప్రదర్శించి.. తమ పరిశోధనల్లో వెలుగుచూసిన అంశాలను వారికి నివేదించారు.

ఇదే విషయాలపై మెక్సికో పాత్రికేయుడు జోస్‌ జైమ్‌ మౌసాన్‌ స్పందిస్తూ.. ఆ వింత ఆకారాలు మానవేతరులవని డీ.ఎన్‌.ఏ పరీక్షల్లో స్పష్టమైందని తెలిపారు. భూ ప్రపంచంలో వేటికీ వీటి డీ.ఎన్.ఏ. సరిపోలడం లేదు కాబట్టే.. గ్రహాంతరవాసుల ఉనికి వాస్తవమని నమ్మాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News