పాక్ లో పాలు కూడా పిరిమాయె.. మనతో పోలిస్తే ఎంత ఎక్కువ?

కొత్త పన్నుతో కరాచీలో అల్ట్రా హై టెంపరేచర్ పాల ధర పాక్ కరెన్సీలో లీటరు 370 రూపాయిలకు చేరుకుంది.

Update: 2024-07-05 06:30 GMT

ధరల పరంగా ఇప్పటికే దారుణమైన పరిస్థితులు నెలకొన్న పాకిస్థాన్ లో తాజాగా పాల ధర భారీగా పెరిగింది. ఇప్పుడా దేశంలో కొత్తగా విధించిన పన్నుతో పాల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో.. పాకిస్థానీయులు గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచంలో డెవలపింగ్ దేశాలుగా పేరున్న ఫ్రాన్స్.. ఆస్ట్రేలియాలో కంటే దాయాది దేశంలోనే పాల ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. మన దేశంతో పోలిస్తే పాకిస్థాన్ లో పాల ధరలు రెట్టింపుగా ఉండటం గమనార్హం. ఇంతకూ మనకు పాకిస్థాన్ కు పాల ధరల విషయంలో ఎంత తేడా ఉందన్న లెక్క చూస్తే.. పాకిస్థానీయుల పరిస్థితి అయ్యో.. అనిపించక మానదు.

ఇప్పటికే ఆ దేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలే కాదు చివరకు గోధుమపిండి ధర కూడా చుక్కల్ని అంటుతున్నాయి. గతంలో పాక్ లో పాలపై ఎలాంటి పన్ను ఉండేది కాదు. గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్యాకేజ్డ్ పాలపై పాక్ సర్కారు ఏకంగా 18 శాతం పన్ను విధించింది. దీంతో.. అక్కడ ధరల్లో ఏకంగా పాతిక శాతం పాల ధర ఒక్కసారిగా పెరిగింది. కొత్త పన్నుతో కరాచీలో అల్ట్రా హై టెంపరేచర్ పాల ధర పాక్ కరెన్సీలో లీటరు 370 రూపాయిలకు చేరుకుంది. అమెరికా డాలర్ తో పోల్చినప్పుడు పాక్ లో ఒక లీటరు పాలు 1.33 డాలర్లుగా ఉంది.

Read more!

పాల ధర పెంపుతో పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వేతనాలు అంతంతగా ఉన్న వేళ.. ఖర్చు చేసే సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. పాకిస్థాన్ లో ఇప్పటికే 40 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని.. పాల ధర పెంపుతో చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి దారి తీయొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ పాల మీద పన్ను వేయటానికి కారణాల్ని చూస్తే.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి ప్యాకేజీని ఆ దేశం కోరుతోంది.

అప్పు ఇచ్చే నేపథ్యంలో సదరు సంస్థ విధించిన షరతులకు లోబడి.. పాలపై పన్ను విధించాల్సి వచ్చింది. పలు విభాగాల్లో పన్ను భారీగా విధించారు. దీని ద్వారా ప్రభుత్వానికి సమకూరే ఆదాయంతో తమ అప్పు తీరుతుందన్నది సదరు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా. ఇక.. పాక్ పాల ధరతో మన దేశంలో పాల ధరల్ని పోల్చినప్పుడు ఇంచుమించు డబుల్ గా ఉందని చెప్పాలి.

మన రూపాయిల్లో కాకుండా అమెరికన్ డాలర్లతో పోలిస్తే.. ఈ లెక్క మరింత సులువుగా అర్థమవుతుంది. అమెరికా డాలర్ తో పోలిస్తే మన దేశంలో లీటరు పాల ధర 0.70 డాలర్లుగా ఉంది. మన పొరుగు దేశమైన నేపాల్ లో 0.78 డాలర్లు. బంగ్లాదేశ్ లోనూ లీటరు పాల ధర 0.74 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం మన దేశంలో లీటరు పాల ధర మన రూపాయిల్లో రూ.68గా ఉంది. అమెరికాలో లీటరు హోల్ మిల్క్ సగటు ధర 0.78 డాలర్ల నుంచి 1.20 డాలర్లు వరకు ఉంది. ఈ లెక్కన చూస్తే.. మన దేశంలో పాల ధర మిగిలిన దేశాలతో పోలిస్తే తక్కువగా ఉందని చెప్పాలి.

Tags:    

Similar News

eac