సిద్ధిఖీ హత్య కేసులో కీలక వ్యక్తి అరెస్ట్... తెరపైకి సంచలన విషయాలు!

ఈ నేపథ్యంలో సిద్ధిఖీ పై కాల్పులు జరిపిన శివకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసలు విషయంపై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది.

Update: 2024-11-11 03:48 GMT

ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ హత్య దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వినిపించిన తుపాకీ చప్పుల్లతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో సిద్ధిఖీ పై కాల్పులు జరిపిన శివకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసలు విషయంపై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది.

అవును... బాబా సిద్ధిఖీ పై కాల్పులు జరిపిన వ్యక్తి శివకుమార్ ను ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ లో అరెస్ట్ చేశారు. ఆ హత్య జరిగినప్పటి నుంచీ పరారీలో ఉన్న శివకుమార్.. నేపాల్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. అయితే... యూపీ టాస్క్ ఫోర్స్, ముంబై క్రైం బ్రాంచ్ కంబైన్డ్ ఆపరేషన్ లో తాజాగా పట్టుబడ్డాడు.

అక్టోబర్ 12న మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ పై బాంద్రా ఈస్ట్ లోని అతని కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖ్ కార్యాలయ భవనం వెలుపల మొత్తం ఆరురౌండ్లు కాల్పులు జరిపగా.. ఇందులో మొత్తం ముగ్గురు షూటర్ల ప్రమేయం ఉందని.. వారందరినీ ఇప్పుడు అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు చెబుతున్నారని తెలుస్తోంది.

ఈ సమయంలో బాబా సిద్ధిఖీ ని చంపడానికి శివకుమార్ 9.9 ఎంఎం పిస్టల్ ని ఉపయోగించాడు. ఇదే సమయంలో... బారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధం ఉన్నట్లు శివకుమార్ విచారణలో అంగీకరించినట్లు చెబుతున్నారు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని శివకుమార్ వెల్లడించాడని అంటున్నారు.

ఇదే సమయంలో... అన్మోల్ బిష్ణోయ్ తో తన పరిచయాన్ని లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడిగా భావిస్తున్న సుభం లోంకర్ అనే వ్యక్తి సులభతరం చేశాడని శివకుమార్ పేర్కొన్నాడని చెబుతున్నారు. దీంతో... బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే అని అంటున్నారు!

కాగా... మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ పై కాల్పులు జరపడానికి ముందు సూటర్లతో అన్మోల్ బిష్ణోయ్ టచ్ లో ఉన్నట్లు ముంబై పోలీసులు గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... నిందితులతో కన్యునికేట్ చేయడానికి అతడు సోషల్ మీడియా అప్లికేషన్ స్నాప్ చాట్ ను ఉపయోగించినట్లు తెలిపారు. మరోపక్క అన్మోల్ ను మోస్ట్ వాంటెడ్ జాబితలో ఎన్.ఐ.ఏ. చేర్చిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News