లిక్కర్ లాటరీ: మంత్రి నారాయణ 100 దరఖాస్తులు వేయిస్తే...?

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ లాటరీ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

Update: 2024-10-15 04:31 GMT

ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ షాపుల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. 26 జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సోమవారం లాటరీ ద్వారా 3,396 దుకాణాలకు ఎంపిక నిర్వహించారు. వీటిలో 10.20% (345 షాపులు) మహిళలు దక్కించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ లాటరీ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలోని 96వ నంబరు దుకాణానికి 132.. 97వ నంబరు దుకాణానికి 120.. పెనుగంచిప్రోలులోని 81వ నెంబరు దుకాణానికి 110 దరఖాస్తులు వచ్చాయి. అయితే.. అనూహ్యంగా ఈ మూడు షాపుల లైసెన్సులు లాటరీలో తెలంగాణ రాష్ట్రం వారినే వరించడం గమనార్హం.

ఇక ఈ విషయంలో రాజకీయ నాకులూ పలు దుకాణాలు దక్కించుకున్నారు. ఇందులో భాగంగా... అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ ధర్మవరం నియోజకవర్గంలో ఐదు దుకాణాలు దక్కించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్రధాన అనుచరులకు.. మడకశిర నియోజకవర్గంలో నాలుగు దుకాణాలు లభించాయి.

ఇదే క్రమంలో చాలా మంది నేతలు ప్రయత్నించినప్పటికీ వరించలేదని అంటున్నారు! అయితే... ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, ప్రముఖ విద్యావేత్త పొంగూరు నారాయణ సుమారు రెండు కోట్ల రూపాయల్తో ఏకంగా 100 దరఖాస్తులు వేశారు. అయితే వారికి మొత్తంగా మూడు దుకాణాలే దక్కాయి!

అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయం కోసం పనిచేసిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల కోసం మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాలో రూ.2 కోట్లతో మద్యం షాపులకు 100 దరఖాస్తులు వేశారు. అయితే... వారికి మొత్తంగా మూడు లిక్కర్ షాపులు లభించాయి.

దీంతో.. ఒక్కో దుకాణాన్ని ఐదుగురు చొప్పున మొత్తం 15 మంది నడుపుకునేలా ఆ లైసెన్సులు కార్యకర్తలకు అప్పగించారు!

Tags:    

Similar News