మంత్రి రోజా సీటు ఆయనకేనా...!?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం ప్రత్యేకమైనది. వైసీపీకి ఇంకా స్పెషల్ సీటు అని చెప్పాలి. ఎందుకంటే 2014, 2019లలో ఈ సీటుని వైసీపీ గెలుచుకుంది.

Update: 2023-12-18 04:24 GMT

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం ప్రత్యేకమైనది. వైసీపీకి ఇంకా స్పెషల్ సీటు అని చెప్పాలి. ఎందుకంటే 2014, 2019లలో ఈ సీటుని వైసీపీ గెలుచుకుంది. వైసీపీ తరఫున సినీ నటి ఆర్కే రోజా ఎమ్మెల్యే అయ్యారు. ఆమె మంత్రిగా కూడా ఉన్నారు. రోజా టీడీపీ నుంచి రెండు సార్లు పోటీ చేస్తే రెండు సార్లూ ఓటమి పాలు అయ్యారు. పైగా ఐరన్ లెగ్ అని అక్కడ పేరు తెచ్చుకున్నారు. కానీ వైసీపీ ఆమె జాతకాన్ని మార్చేసింది. ఆమె గోల్డెన్ లెగ్ కూడా అయ్యారు.

ఇదిలా ఉంటే ఇపుడు ముచ్చటగా మూడవసారి రోజా నగరి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే నగరి నియోజకవర్గంలో రోజా పట్ల వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. దాంతో ఆమెకు టికెట్ ఈసారి ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. మరి ఎవరికి ఇస్తారు అంటే అక్కడే ఉంది ట్విస్ట్.

నగరి నియోజకవర్గానికి చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డికి ఈ సీటు ఖరారు అవుతోంది అని అంటున్నారు. ఆయన శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా ఉన్నారు. పైగా ఆయన నగరిలో పట్టున నాయకుడు. పక్కా లోకల్. వైసీపీలో ఎక్కువ మంది ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధి కావాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు.

ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి వైసీపీలో చక్రం తిప్పుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఆయనకు నిండుగా ఉన్నాయని అంటునారు. చాలా కాలంగా చూస్తే నగరిలో రాజకీయంగా ఆయన ఆధిపత్యం ఎక్కువగా ఉంది అని అంటున్నారు. దాంతో పాటు ఆయనకు టికెట్ ఇస్తే టీడీపీని గట్టిగా ఢీ కొట్టగలరని అంటున్నారు. దాంతో ఆయన పేరుని సీరియస్ గానే వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇక మంత్రి రోజాకు పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆమె సేవలను పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటుందని అంటున్నారు. రాష్ట్రమంత్రా వైసీపీ స్టార్ కాంపెనియర్ గా ఆమె పర్యటించేలా రూట్ మ్యాప్ ఇస్తారని అంటునారు. మొత్తానికి చూస్తే రోజా ప్లేస్ లో చక్రపాణి రెడ్డి నగరి వైసీపీ అభ్యర్ధి అవుతారు అని జోరుగా ప్రచారం సాగుతోంది.

దీని మీద రోజా ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది. ఇక ఇక్కడ నుంచి టీడీపీ తరఫున మాజీ మంత్రి ముద్దుక్రిష్ణం నాయుడు కుమారుడు భానుప్రకాష్ పోటీ చేయబోతున్నారు. ఆయన 2019లో పోటీ చేసి ఓడారు. ఈసారి ఆయన గెలవాలని చూస్తున్నారు. వైసీపీ నుంచి చక్రపాణిరెడ్డి అయితే ఆయన్ని ఎదుర్కోగలరని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News