ఆ మంత్రిగారి విజ‌యం ముందే రాసిపెట్టుకున్నార‌ట‌.. బీఆర్ఎస్ టాక్‌.. !

"ఎన్నిక‌ల్లో నాదే విజ‌యం.. రాసిపెట్టుకో!" - ఇది రాజ‌కీయాల‌లో ఉన్న నాయ‌కులు త‌ర‌చుగా చేసే స‌వా ల్‌.

Update: 2023-11-12 09:35 GMT

``ఎన్నిక‌ల్లో నాదే విజ‌యం.. రాసిపెట్టుకో!`` - ఇది రాజ‌కీయాల‌లో ఉన్న నాయ‌కులు త‌ర‌చుగా చేసే స‌వా ల్‌. అయితే.. నిజంగానే ఓ మంత్రిగారు త‌న విజ‌యాన్ని రాసిపెట్టుకోవాలంటూ.. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌.. విజ‌యంపై ధీమాగా ఉన్నారు. అంతేకాదు.. విజ‌యం రాసిపెట్టుకోవాల‌ని ఆయ‌న త‌న అనుచ‌రుల‌కు తేల్చి చెబుతున్నార‌ట‌.

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలోకంటే.. పొరుగు నియోజ‌క‌వ‌ర్గంపైనే మంత్రి ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, మంత్రి కేటీఆర్ సూచ‌న‌ల మేర‌కు త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ కూక‌ట్‌ప‌ల్లి, దిల్‌షుక్‌న‌గ‌ర్ వంటి సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డి అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్నా రు. మొత్తానికి సెటిల‌ర్ల ఓటుకు త‌ల‌సాని ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. ఈ క్ర‌మంలో త‌న నియోజ కవ‌ర్గంలో తాను ప్ర‌చారం చేసుకోక‌పోయినా.. ఇబ్బంది లేద‌నే ధోర‌ణిలో ఉన్నారు.

ఇక, 2014లో టీడీపీ త‌ర‌ఫున స‌న‌త్‌న‌గ‌ర్ నుంచి బ‌రిలో దిగిన త‌ల‌సాని 27 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ తో విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత పార్టీ మారి బీఆర్ ఎస్‌కు జై కొట్టారు. ఈ క్ర‌మంలో 2018లో ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి మ‌రింత ఎక్కువ‌గా 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ ద‌క్కించుకున్నారు. నిజాని కి పార్టీ మారిన వారిపై ఉండే వ్య‌తిరేక‌త‌ను కూడా అధిగ‌మించ‌డంతో పాటు అత్య‌ధిక మెజారిటీ కూడా సొంతం చేసుకున్నారు.

ఈ ధీమాతోనే.. ఇప్పుడు ఆయ‌న తన నియోజ‌క‌వ‌ర్గంలో కూడా పెద్ద‌గా ప్ర‌చారంలో పాల్గొనడం లేదు. త‌న అనుచ‌రులు, కుమారుడు, బంధువులు మాత్ర‌మే ప్ర‌చారంలో క‌నిపిస్తున్నారు. అంతేకాదు.. మంత్రిని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా వారు చెబుతున్నారు. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో ఉద్యోగ‌, కార్మిక సంఘాలు.. మంత్రికి అనుకూలంగా ఉండ‌డం... మాస్ నాయ‌కుడిగా త‌ల‌సాని గుర్తింపు తెచ్చుకున్న నేప‌థ్యంలో ఆయ‌న ఇంత ధైర్యంగా ఉంటున్నార‌నే వాద‌న ఉంది.

Tags:    

Similar News