.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. అసలేమైంది?

రానున్న ఐదేళ్లు పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటిస్తే ఊరుకునేది లేదని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు

Update: 2024-06-30 12:10 GMT

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆయన రాకకు ముందే తెలుగుదేశం.. జనసేన నేతలు రోడ్ల మీదకు వచ్చి.. ఎంపీ మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన్ను పుంగనూరులోకి రానివ్వకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతికి చేరుకున్న మిథున్ రెడ్డిని.. పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రానున్న ఐదేళ్లు పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటిస్తే ఊరుకునేది లేదని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. వైసీపీ పాలన వేళ.. విపక్షాలను పుంగనూరులోకి అడుగు పెట్టనివ్వని మిథున్ రెడ్డి తీరును ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. రాజంపేట ఎంపీగా వ్యవహరిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల ఫలితాల తర్వాత పుంగూరు అసెంబ్లీ.. రాజంపేట ఎంపీ స్థానం పరిధిలో టీడీపీ కూటమి నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. తనను తన నియోజకవర్గంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని.. ఈ అంశంపై పార్లమెంటు స్పీకర్ కు కంప్లైంట్ చేస్తానని చెప్పారు. ఏపీలో టీడీపీ కూటమి సర్కారు కొత్త సంప్రదాయానికి తెర తీస్తుందన్నారు.

Read more!

జేసీబీలు తీసుకొచ్చి పేదల ఇళ్లు కూలుస్తున్నట్లుగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే స్వాగతిస్తామని.. పేదల ఇళ్లపై దాడులు చేయటం దారుణమని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు.. కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్న ఆయన.. పార్టీ మారాలంటూ తమ కార్యకర్తలను బెదిరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఒత్తిళ్లు.. ప్రలోభాలకు గురి చేయటం ద్వారా పార్టీ మారిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

తాను బీజేపీలోకి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్న ఆయన.. గతంలో ఎప్పుడూ లేని పరిస్థితులు ఇప్పుడు పుంగనూరులో చోటు చేసుకుంటున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. టీడీపీ కూటమి నేతలు.. కార్యకర్తల వాదన మరోలా ఉంది. గడిచిన ఐదేళ్లో పెద్దిరెడ్డి.. మిథున్ రెడ్డిలు చేసిన అరాచకాల గురించి మరచిపోయి.. తమ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

Tags:    

Similar News