బైడన్ కు మోడీ ఆత్మీయ ఆలింగనం..
‘‘ఫిలడెల్ఫియాలో అద్భుతమైన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతం, వారి ఆశీస్సులు ఎంతో విలువైనవి’’ అని పేర్కొన్నారు ప్రధాని మోడీ.
మనం మన మాదిరే ఉందాం. ఎక్కడికో వెళ్లి.. వాళ్ల పద్దతిని ఎందుకు ఫాలో కావాలి? ప్రాశ్చాత్య దేశాలు ఎవరికి వారు వారి కల్చర్ ను బలంగా ప్రమోట్ చేసుకునే వేళలో..మనం మాత్రం ఎందుకు తగ్గాలన్నట్లుగా మోడీ వ్యవహరిస్తారని చెప్పాలి. మోడీకి ముందు దేశానికి ప్రధానమంత్రులుగా వ్యవహరించిన వారికి.. మోడీకి తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తాను కలిసే ఏ దేశ ప్రధాని.. దేశాధ్యక్షుడు.. ఎవరైనా.. ఎంత తోపైనా చేసే తాను మాత్రం ఒకేలా వ్యవహరించటం.. తన సిగ్నేచర్ హగ్ ను వారికి ఆత్మీయ ఆలింనగంగా ఇవ్వటం మోడీకి అలవాటు.
మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు తనదైన ఆత్మీయ ఆలింగనాన్ని అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. తన యూఎస్ టూర్ లో భాగంగా డెలావేర్ లోని గ్రీన్ విల్లేకు చేరుకన్న ఆయనకు భారతీయులు ఘన స్వాగతం పలికారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. ఆరో క్వాడ్ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సదస్సులో పాల్గొనేందుకు ఫెలడెల్ఫియా నుంచి డెలావర్ కు చేరుకున్నారు. డెలావర్ నగరం గురించి ఒక మాట చెప్పాలి. ఇది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సొంత నగరం. విమానాశ్రయం నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కలిశారు. ఈ సందర్భంగా మోడీకు బైడెన్ ఆత్మీయ స్వాగతం పలకగా.. అందుకు ప్రతిగా మోడీ ఆయనకు తన ఆత్మీయ ఆలింగనాన్ని అందించారు. అనంతరం ఈ ఇద్దరు అగ్రనేతలు ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు రష్యా.. ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించిన అంశాల మీద చర్చించుకున్నట్లు తెలిసింది. తాను అమెరికాకు చేరుకున్న తర్వాత తనకు లభించిన ఘన స్వాగతం గురించి ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘‘ఫిలడెల్ఫియాలో అద్భుతమైన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతం, వారి ఆశీస్సులు ఎంతో విలువైనవి’’ అని పేర్కొన్నారు ప్రధాని మోడీ.
డెలావేర్ లోని విల్మింగ్ టన్ లో క్వాడ్ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్)దేశాధినేతల సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ క్వాడ్ సదస్సులో జపాన్.. అమెరికా.. ఆస్ట్రేలియా.. భారత్ దేశాలు సభ్యులుగా ఉంటాయి. ఈ సదస్సులో బాగంగా జపాన్.. అమెరికా.. ఆస్ట్రేలియా దేశాధినేతలతో ప్రధాని మోడీ సంప్రదింపులు జరపనున్నారు. దీని తర్వాత సెప్టెంబరు 22న (అమెరికా కాలమానం ప్రకారం) లాంగ్ ఐలాండ్లో ప్రవాస భారతీయులతో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్ కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి పద్నాలుగు వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొంటారు.
ఈ ప్రోగ్రాంలో భాగంగా వేదికపై గ్రామీ అవార్డు నామినీ చంద్రికా టాండన్.. స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందార్ తో సహా 382 మంది జాతీయ.. అంతర్జాతీయ కళాకారులు వివిధ సాంస్కృతిక కళలు ప్రదర్శిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ జరుగుతున్న మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో అటు డెమొక్రాట్లు.. ఇటు రిపబ్లికన్ పార్టీ నేతలు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొన్ని ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాల్ని నిర్వహించనున్నారు. సెప్టెంబరు 23న యూఎన్ జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ లో ప్రధాని మోడీ కీలక ప్రసంగాన్ని చేయనున్నారు.