మోడీ చేసిన దానికి పొంగిపోతున్న బాబు!

తాజాగా ఆయ‌న కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై(ఒక‌ర‌కంగా ఈయ‌న కూడా భాగ‌స్వామే క‌దా) ప్రశంస‌ల జ‌ల్లు కురిపించారు.

Update: 2024-09-05 04:55 GMT

చిన్న సాయానికి పెద్ద కృత‌జ్ఞ‌త‌. చిన్న పొగ‌డ్త‌కే పెద్ద సంతోషం.. ఇది అంద‌రికీ సాధ్యం కాదు. ఎక్క‌డో ఒక్క‌రో ఇద్ద‌రో ఉంటారు. ఇలాంటి వారినే బోళా మ‌నుషుల‌ని వ్యాఖ్యానిస్తారు. ఇప్పుడు ఈ మాటే సీఎం చంద్ర‌బాబు విష‌యంలోనూ వినిపిస్తోంది. ఎంద కంటారా? తాజాగా ఆయ‌న కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై(ఒక‌ర‌కంగా ఈయ‌న కూడా భాగ‌స్వామే క‌దా) ప్రశంస‌ల జ‌ల్లు కురిపించారు. అదేవిధంగా.. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వారు సైతం ల‌క్ష‌ల్లో విరాళాలు ఇచ్చినా.. పొంగిపోతున్నారు. నిజానికి ఇంత పెద్ద విప‌త్తులో ఆ మాత్రం సాయం చేయ‌డం మాన‌వతా ల‌క్షణం.. కానీ, చంద్ర‌బాబు దీనికే పొంగి పోతున్నారు.

ఇంత‌కీ కేంద్రం ఏం చేసిందంటే.. విజ‌య‌వాడ‌కు పోటెత్తిన వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు కేంద్రానికి అభ్య‌ర్థ‌న పంపించారు. దీంతో 3 ఆర్మీ హెలికాప్ట‌ర్ల‌ను పంపించారు. అదేవిధంగా ఎన్డీఆర్ ఎఫ్ నుంచి 50 మ‌ర ప‌డ‌వ‌ల‌ను పంపించారు. రెండు విమానాల ను పంపించారు. ఇంత‌కు మించి..కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది ఏమీ లేదు. ఇది వాస్త‌వం. అయితే.. ఇంత‌లోనే.. కేంద్రం ఒక నిర్ణ‌యం తీసుకుంది. ఇదే చంద్ర‌బాబు ఆనందానికి కార‌ణ‌మైంది. గురువారం కేంద్రం నుంచి ప్ర‌త్యేక బృందం వ‌చ్చి.. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నుంది. అనంత‌రం.. ఒక నివేదిక ఇవ్వ‌నుంది. దీని ప్ర‌కార‌మే కేంద్రం సాయం చేయ‌నుంది.

వాస్త‌వానికి ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జ‌రిగేదే. అంతేకాదు.. కేంద్రం ఎప్పుడూ చేసేదే. కానీ, చంద్ర‌బాబు మాత్రం మురిసిపోయారు. ఆ వెంట‌నే ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల‌కు ఆయ‌న కృతజ్ఞ‌త‌లు తెలిపారు.

నిజానికి.. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీకి.. ఏపీలో కూట‌మి స‌ర్కారులో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. ఇప్ప‌టికే ఎంతో సాయం చేసి ఉండాలి. క‌నీసం ముంద‌స్తుగా 1000 కోట్ల రూపాయ‌లు ఇవ్వ‌డంతోపాటు.. అవ‌స‌ర‌మైతే.. ఆర్మీని కూడా రంగంలోకి దింపి ఉండాలి.

అదేస‌మ‌యం లో ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందిని కూడా పంపించి ఉండాలి. కానీ, ఇవేవీ చేయ‌లేదు. ఇప్పుడు కేంద్ర బృందం వ‌చ్చి.. ప‌రిశీలించి.. ఇచ్చిన నివేదిక ఆధారంగా మాత్ర‌మే కేంద్రం సాయం నుంది. అయినా.. చంద్ర‌బాబు మురిసిపోతున్నారు. అందుకే.. ఇంత బోళా మ‌నిషివేంటి బాబూ.. అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News