మోడీ పవన్ మధ్య సీరియస్ డిస్కషన్...!

ఎల్బీ స్టేడియం లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగులో పాల్గొన్నారు

Update: 2023-11-09 03:59 GMT

ఎల్బీ స్టేడియం లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మోడీ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఒక వైపు వక్తలు మాట్లాడుతూంటే మోడీ పవన్ చాలా సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్లుగా అక్కడ చూసిన వారికి అయితే అర్ధం అయింది.

ఇద్దరూ డీప్ గానే చర్చించినట్లుగా అయితే వారిని చూసిన వారికి అర్ధం అయింది. ఏమి మాట్లాడుకున్నారు అన్నది తెలియకపోయినా వారి మధ్య చాలా కీలక అంశాలే దొర్లాయని అంటున్నారు. మీటింగ్ ఒక వైపు సాగుతున్నా వేదిక మీద ఉన్న మిగిలిన బీజేపీ నేతలతో పాటు జనం కూడా మోడీ పవన్ లనే ఆసక్తికరంగా చూడడం జరిగింది. ఇక మోడీని తన ప్రసంగంలో పవన్ ఆకాశానికి ఎత్తేస్తే మోడీ నా పక్కన పవన్ ఉన్నారు. ఎదురుగా జనసునామీ ఉందని చెప్పి పవన్ గురించి ఫ్యాన్స్ గుండెల్లో ఆనందం పొంగెలా మాట్లాడారు.

ఇవన్నీ పక్కన పెడితే అసలు మోడీ పవన్ ఏమి చర్చించి ఉంటారు అన్నది మాత్రం ఎవరికి వారు తమకు తోచిన విధంగా చెప్పుకుంటున్నారు. కేవలం తెలంగాణా ఎన్నికల మీదనే వారి మధ్య చర్చ సాగిందా లేక ఏపీ రాజకీయాల మీద కూడా మాట్లాడుకున్నారా అన్నది కూడా అని ఆలోచిస్తున్నారు.

పవన్ కి తెలంగాణా కంటే ఏపీ ముఖ్యం. చాలా సార్లు ఢిల్లీకి వెళ్ళినా అమిత్ షాతో భేటీ అవుతోంది కానీ మోడీతో కుదరడం లేదు. బీసీ సభ పుణ్యమాని పవన్ మోడీ పక్క పక్కనే గంటకు పైగా గడిపేందుకు వీలు చిక్కింది. దాంతో పవన్ ఏపీ పాలిటిక్స్ గురించి తన ఆలోచనలు గురించి కూడా మోడీ చెవిన వేసి ఉంటారు అని అంటున్నారు.

మోడీ సైతం పవన్ని ఆప్యాయంగా పలకరించడం పక్కన కూర్చోబెట్టుకుని అన్నీ ముచ్చటించడం చూస్తే పవన్ కి తెలుగు రాజకీయాల్లో ఆయన విశేష ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానే ఉంది అని అంటున్నారు. ఇక రానున్న రోజులలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి.

అక్కడ బీజేపీ తో పొత్తు జనసేనకు ఉన్నా టీడీపీతో కూడా పవన్ పొత్తు కలిపారు. ఆ రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణకు రంగం సిద్ధం అవుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీని కూడా టీడీపీ జనసేన కూటమిలోకి తెచ్చేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు.

బహుశా అలాంటి విషయాలు అన్నీ కూడా ఎంతో కొంత అయినా చూచాయగా అయినా పవన్ చెప్పి ఉంటారా అన్నదే అందరిలోనూ మెదిలే ప్రశ్నలుగా ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సభలో పవన్ కి మోడీ ఇచ్చిన గౌరవం, ఆయన పట్ల కనబరచిన ప్రేమ చూసిన వారు ఎవరైనా బీజేపీ జనసేన జట్టు వీడరు అనే అంటారు. ఇక టీడీపీతో ఏపీలో బంధం ఎలా కల్సుతుంది, ఎవరు కలుపుతారు. ఏ సమీకరణలు పనిచేస్తాయన్నది రానున్న కాలమే చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News