యువరాణికి డిప్యూటీ సీఎం పదవి.. మోడీషాల లెక్కలే వేరు!

ఈ నెల మూడున ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. అందులో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది.

Update: 2023-12-13 04:44 GMT

రోటీన్ కు భిన్నమైన రాజకీయాల్ని చేయటంలో మోడీషాలకు మించినోళ్లు లేరు. పేరున్న ప్రముఖులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ప్రయత్నాలు చేస్తున్న వేళ.. వారి ఒత్తిళ్లను పెద్దగా పట్టించుకోకుండా తమకున్న లెక్కలతోముందుకు వెల్లటం వారు చేస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసిన తీరు.. సదరు నేతల్ని చూస్తే.. ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. అంచనాలకు అందని రీతిలో నేతల్ని కీలక పదవులకు ఎంపిక చేయటం కనిపిస్తుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతను తీసుకెళ్లి ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టటం మోడీషాలకే చెల్లుతుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మను సీఎంగా ఎంపిక చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు మోడీషాలు.

ఈ నెల మూడున ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. అందులో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్నిఎంపిక చేసే విషయంలో తమదైన ఫార్ములాను ప్రదర్శించింది. అందరి అంచనాలకు భిన్నమైన వారిని సీఎంలుగా ఎంపిక చేసింది. ఛత్తీస్ గఢ్.. మధ్యప్రదేశ్ లో ఇలాంటి పనే చేసిన మోడీషాలు.. రాజస్థాన్ లోనూ అదే తీరును ప్రదర్శించింది. అంతేకాదు.. ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా యువరాణిని ఎంపిక చేయటం ఆసక్తికరంగా మారింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే.. భైరవ.. దియాకుమారిలను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేశారు.

ఇంతకీ ఈ దియా కుమారి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. రాజస్థాన్ రాజకుటుంబానికి చెందిన దియాను ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆమెను.. డిప్యూటీ సీఎంగా ఎంపకి చేశారు. 1971లో ఆమె జైపూర్ మహారాజ కుటుంబంలో జన్మించారు. తాత మాన్ సింగ్ 2 బ్రిటీష్ ఇండియా కాలంలో చివరి జైపూర్ మహారాజు. తండ్రి బిగ్రేడియర్ సవాయ్ భవానీ సింగ్ మహావీర చక్ర అవార్డు గ్రహీత. ఆయన 1971లోఇండియా - పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారు.

దియా కుమారి స్కూలింగ్.. కాలేజీ చదువులు మహారాణి గాయత్రీ దేవికి చెందిన విద్యా సంస్థల్లోనే చేశారు. కాలేజీ చదువుల తర్వాత ఆమె నరేంద్ర సింగ్ ను పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు. 2018లో ఆమె నరేంద్ర సింగ్ తో విడాకులు తీసుకొని విడిగా ఉంటున్నారు. రాజకీయాల్లో ఆమెకున్న ఆసక్తితో 2013లో మాధోపూర్ నియోజకవర్గంనుంచి ఆమె పోటీ చేసి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయినంతనే పలు డెవలప్ మెంట్ యాక్టివిటీస్ చేసిన ఆమె.. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాజసమంద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.

రాజకీయాలతో పాటు పలు వ్యాపారాల్ని నిర్వహిస్తుండటం గమనార్హం. రియల్ ఎస్టేట్.. బిజినెస్ వెంచర్లు.. రెండు స్కూళ్లు.. మ్యూజియం.. ట్రస్టు.. హోటల్.. ఎన్ జీవోలను నిర్వహించటం కనిపిస్తుంది. ఇటీవల ఆమెకు డాక్టరేట్ జైపూర్ లోని అమిటీ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విద్యాదర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె ప్రత్యర్థిపైన 71,368 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

Tags:    

Similar News