మోడీ బడ్జెట్: కార్పొరేట్ ఇమ్మిడియెట్ లాభాల పంట!
బడ్జెట్‌లో సుంకం తగ్గించడంతో ఈ కంపెనీకి 24 గంటల్లోనే 19000 కోట్ల రూపాయల లబ్ధి చూకూరిందని నేరుగా కంపెనీనే ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే 3.0 ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్.. తక్షణ లాభా లను ఎవరికి మోసుకువచ్చింది? ఎవరికి వెను వెంటనే లబ్ధి చేకూర్చింది? అంటే.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటన ప్రకారం.. పేదలకు, మధ్యతరగతి వారికి మేలు చేస్తుందని చెప్పారు. దీనిని అందరూ నిజమేనని అనుకున్నారు. కానీ, వాస్తవం వేరు. బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన 24 గంటలు కూడా గడవక ముందే.. ఇది కార్పొరేట్ కంపెనీలకు తక్షణ లాభాలను తెచ్చి పెట్టింది.
ఇదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కేవలం చర్చ మాత్రమే కాదు. వాస్తవాలు కూడా అలానే ఉన్నాయి. దేశ పారిశ్రామిక దిగ్గజం.. టాటా కంపెనీకి ఈ బడ్జెట్ ఏకంగా.. 24 గంట్లలో 19 వేల కోట్ల రూపాయ ల లాభాలను పండించుకునేలా చేసింది. టాటా కంపెనీ కేవలం వాహన సేవల్లోనే కాకుండా..బంగారం, వజ్రాల వ్యాపారంలోనూ ఉన్న విషయం తెలిసిందే. బడ్జెట్‌లో సుంకం తగ్గించడంతో ఈ కంపెనీకి 24 గంటల్లోనే 19000 కోట్ల రూపాయల లబ్ధి చూకూరిందని నేరుగా కంపెనీనే ప్రకటించింది.
ఎలా.. సాధ్యం?
+ బడ్జెట్‌లో బంగారం, వెండిపై దిగుమతి పన్నును 6% తగ్గించారు.
+ దీంతో టాటా గ్రూప్‌కు చెందిన 'టైటాన్' షేర్లు దాదాపు 7% పెరిగాయి.
+ టాటాకు చెందిన నగల వ్యాపారం తనిష్క్ స్టాక్ విలువలో వృద్ధిని సాధించింది.
+ తనిష్క్ షేరు 6.63 శాతం పెరిగి రూ.3,468.15 వద్ద ముగిసింది.
+ ట్రేడింగ్ సెషన్‌లో... బుధవారం తనిష్క్(టాటా) షేర్లు 7.30% పెరుగుదల నమోదైంది.
+ మంగళవారం ఉదయం టైటాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,88,757.16 కోట్లు
+ బుధవారం ఉదయం.. అంటే బడ్జెట్ అనంతరం.. ఈ విలువ రూ.3,07,897.56 కోట్లకు పెరిగింది.
+ అంటే.. టాలా వాల్యుయేషన్ రూ.19,140.4 కోట్లు పెరిగిందన్న మాట.
సామాన్యులకు ఒరిగిందేంటి?
+ బడ్జెట్ ప్రవేశ పెట్టి 24 గంటలు గడిచిన తర్వాత కూడా సామాన్యులకు ఊరట లభించలేదు.
+ ఏ ధరలూ తగ్గలేదు. పైగా.. బంగారం ధర తగ్గిందని భావించినా.. రోజూ దానిని కొనుగోలు చేయలేరు కదా!