జంబోజెట్ క్యాబినెట్ తో మోడీ రెడీ

అయితే ఇంకా ఎవరికైనా అన్నట్లుగా ఒక తొమ్మిది బెర్తులు అలా అట్టేబెట్టారు. మొత్తం మంత్రివర్గం 81 దాకా ఉండొచ్చు.

Update: 2024-06-10 04:05 GMT

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. మొదట ఆయన ముప్పయి మందితోనే ప్రమాణం చేస్తారు అని అనుకున్నా నంబర్ చూస్తే 72 దాకా ఉంది. దాంతో పూర్తి క్యాబినెట్ తోనే ప్రధాని ప్రమాణం చేశారు అని అర్ధమవుతోంది

అయితే ఇంకా ఎవరికైనా అన్నట్లుగా ఒక తొమ్మిది బెర్తులు అలా అట్టేబెట్టారు. మొత్తం మంత్రివర్గం 81 దాకా ఉండొచ్చు. అంటే టోటల్ పార్లమెంట్ సభ్యులు 543లో ఇది పదిహేనవ వంతు అన్న మాట. ఆ కొలమానం ప్రకారమే మంత్రులను తీసుకోవాలి.

అయితే మోడీ మొత్తం తనతో సహా 72 మందికి చోటు ఇచ్చారు. ఇందులో ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణా నుంచి ఇద్దరికీ చోటు దక్కింది. అలాగే చూస్తే కనుక ఎన్డీయే మిత్ర పక్షాలకు మోడీ 11 మంత్రి పదవులు కేటాయించారు. ఆ మిగిలిన 61 మంది బీజేపీ నుంచి వచ్చిన వారే.

ఇక ప్రమాణం చూస్తే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు ఆ తరువాత వరస క్రమంలో రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్‌డీ కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంజీ, రాజీవ్ రంజన్ సింగ్, శరబానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, కింజారపు రామ్మోహన్ నాయుడు వంటి వారు చేశారు.

అదే విధంగా ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, మన్సుక్ మాండవీయ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, సీఆర్ పాటిల్, ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘావాల్, ప్రతాప్ రావ్ జాదవ్, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద్ నాయక్, పంకజ్ చౌదరి, కిషన్ పాల్, రాందాస్ అథవాలే మంత్రులు గా ప్రమాణం చేశారు.

ఇక ఆ తరువాత వరసలో రామ్‌నాథ్ ఠాకూర్, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్, వి.సోమన్న, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ భగేల్, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బీఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేశ్ గోపి, డాక్టర్ ఎల్ మురుగన్, అజయ్ టంటా, బండి సంజయ్ కుమార్, కమలేశ్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి, సతీశ్ చంద్ర దుబే, సంజయ్ సేథ్, రవ్ నీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజందార్, సావిత్రీ ఠాకూర్, తోకన్ సాహు, రాజ్ భూషణ్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, హర్ష్ మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మొహోల్, జార్జ్ కురియన్, పబిత్ర మార్గరెటా ప్రమాణం చేశారు.

ఇందులో సామాజిక వర్గాల పరంగా చూస్తే 27 మంది ఓబీసీలు ఉన్నారు. అలాగే పది మంది ఎస్సీలు ఉన్నారు. అయిదుగురు ఎస్టీలు ఉన్నారు. మైనారిటీలు మరో అయిదుగురు ఉన్నారు. మోడీ మంత్రి వర్గంలో అతి పెద్ద వయస్కుడిగా బీహార్ కి చెందిన జితన్ రామ్ మాంజీ, ఉన్నారు. ఈయన వయసు ఎనభై ఏళ్ళు.

మోడీ మంత్రివర్గంలో 30 మందికి క్యాబినెట్ హోదా కల్పించారు. ఇక మొత్తం క్యాబినెట్ లో అనుభవం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ముప్పయి తొమ్మిది మందికి పైగా క్యాబినెట్ మంత్రులు గతంలో పనిచేసిన వారే కావడం విశేషం. అలాగే మరో 23 మంది ఆయా రాష్ట్రాలలో మంత్రులుగా పనిచేసి ఉన్నారు.

Tags:    

Similar News