అందరూ పెళ్లి కొడుకులే అన్న మోడీ... వాయించి వదులుతున్న విపక్షాలు!

ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమి "ఇండియా"పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోడీ. ఇది ఇండియా కూటమి కాదని, ఘమ్ ఇండియా కూటమి అని అభివర్ణించారు.

Update: 2023-08-10 15:16 GMT

మణిపూర్ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడం, స్వయంగా సుప్రీంకోర్టే కల్పించుకోవడం, విపక్షాలు డబుల్ ఇంజిన్ సర్కార్ పై సెటైర్స్ వేయడం, ఆన్ లైన్ వేదికగా నెటిజన్లు మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం, బీజేపీ పతనం స్టార్ట్ అనే కామెంట్లు రావడం.. మోడీ పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరవ్వడం తెలిసిందే.

ఈ సమయంలో మణిపూర్ ఘటనపై మోడీ మాట్లాడాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే పార్లమెంట్ సమావేశాలకు మోడీ గైర్హాజరయ్యారు. ఈ సమయంలో విపక్షాలు.. అవిశ్వాస తీర్మానం అనే అస్త్రాన్ని ప్రయోగించాయి. చర్చకు పట్టుబట్టాయి. దీంతో మోడీ పార్లమెంటుకు రావడం తప్పలేదు. ఈ సందర్భంగా ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును.. ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌ సభలో మాట్లాడారు. దీనిపై మూడు రోజుల పాటు జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానం ఇచ్చారు. 2024లో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్పారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మోడీ తప్పుపట్టారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విపక్షాలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వచ్చాయని పేర్కొన్నారు. దీంతో... అసలు అవిశ్వాసం పెట్టడానికి గల కారణాలపై కామెంట్లు రాలేదా అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

ఇదే సమయంలో పనిచేసే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోన్నాయని మోడీ విమర్శించారు. అందులో భాగంగానే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమి "ఇండియా"పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోడీ. ఇది ఇండియా కూటమి కాదని, ఘమ్ ఇండియా కూటమి అని అభివర్ణించారు. ఈ కూటమిలో అందరూ పెళ్లి కొడుకులే ఉన్నారని వ్యాఖ్యానించారు.

అయితే అసలు విషయం తప్ప అన్నీ మాట్లాడుతున్నట్లుగా మోడీ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మణిపూర్‌ పై మాట్లాడటానికి నోరు మెదపని ప్రధానికి.. తమపై విమర్శలు చేయడానికి మాత్రం నోరు పెగులుతుందని ధ్వజమెత్తాయి! భారత్ అంటే కేవలం ఎన్డీఏ మాత్రమే కాదంటూ తేల్చి చెప్పాయి. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేశాయి.

మరోపక్క మణిపూర్ ఘటనపై పూర్తి భాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారంటూ బీజేపీ పెద్దలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News