ఆర్-ఆర్-ఆర్‌ను మించిన `ఆర్-ఆర్` వసూళ్లు: మోడీ
కానీ, బీఆర్ ఎస్ పార్టీ కలలు మాత్రమే నెరవేరాయని.. ప్రజల కలలను బుట్టదాఖలు చేశారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తెలంగాణలో పర్యటించారు. తొలుత ఆయన వేములవాడ రాజరాజేశ్వ రుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. వేములవాడలోనే ఏర్పాటు చేసిన ఎన్నికల ప్ర చార సభలో మోడీ ప్రసంగించారు. దేశంలో, రాష్ట్రంలో ఆర్-ఆర్-ఆర్ సినిమా వసూళ్లను మించి.. తెలంగా ణలో `ఆర్-ఆర్(రేవంత్-రాహుల్) ట్యాక్స్` వసూలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే.. ఇక్కడి ప్రజల కలలు నెరవేరుతాయని అందరూ అనుకున్నట్టు చెప్పారు.
కానీ, బీఆర్ ఎస్ పార్టీ కలలు మాత్రమే నెరవేరాయని.. ప్రజల కలలను బుట్టదాఖలు చేశారని అన్నారు. కుటుంబపార్టీ పాలనలో రాష్ట్రం వెనక్కి పోయిందన్నారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అలానే ఉందన్నారు. ఆర్-ఆర్ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలే ఇలా ఉంటాయని దుయ్యబట్టారు. మార్పు తెస్తామన్న కాంగ్రెస్.. అవినీతి పాలన సాగిస్తోందని.. ఈ అవినీతి విషయంలో గత ప్రభుత్వం(బీఆర్ ఎస్)-ప్రస్తుత ప్రభుత్వం(కాంగ్రెస్) పోటీ పడుతున్నాయని చెప్పారు.
ఎంపీ బండి సంజయ్‌పై ఈ సందర్భంగా మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. అవినీతిపై పోరాడుతున్నా రని చెప్పారు. కరీంనగర్‌లో ఆయన గెలుపు ఖాయమైందని ప్రధాని మోడీ చెప్పారు. అందరూ అభినందిం చాలని పిలుపునిచ్చారు. ఇక, ఇప్పటి వరకు.. జరిగిన మూడు దశల ఎన్నికల్లోనూ.. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్న విషయం స్పష్టమైందని ప్రధాని మోడీ తెలిపారు. ఇదే కాంగ్రెస్‌కు నిద్ర కూడా పట్టనివ్వడం లేదని వ్యంగ్యాసత్రాలు సంధించారు.
ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకుపోయిందన్న ప్రధాని.. కాంగ్రెస్‌కు ఈసారీ పరాభవమేనని చెప్పారు. ఎన్డీయే కూటమి(బీజేపీ నేతృత్వం) వైపు ప్రజలు మొగ్గు చూ పుతున్నారని తెలిపారు. ఎన్డీయే వరుసగా మూడోసారి విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చేందు కు ఆట్టే సమయం లేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కుటుంబ పార్టీలేనని, వాటికి కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని.. ప్రజలు కాదని.. నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు.