నేను 2047 వ‌ర‌కు పాలిస్తా!... మోడీ..: ఆయ‌న‌కు పిచ్చిప‌ట్టింది: ఇండియా

ఇక , కేంద్రంలోనూ బీజేపీ మూడో సారి వ‌చ్చే అవ‌కాశాల‌ను ఎవరూ తోసిపుచ్చ‌డం లేదు.

Update: 2024-05-26 10:30 GMT

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. ఆయ‌న అనుకుని అంటున్నారో... లేక అనాలోచితంగా అంటున్నారో తెలియ‌దు కానీ.... ఇప్ప‌టికిరెండు ప్ర‌ధాన మీడియా చానెళ్లకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల ఆంత‌ర్యం ఏంటో తెలియాల్సి ఉంది. రెండు కీల‌క అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌ని మోడీ వ‌రుస‌గా మూడోసారి యూపీలోని వార‌ణాసి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయ‌న గెలుపు ఖాయ‌మేన‌ని అంచ‌నాలు ఉన్నాయి.

ఇక , కేంద్రంలోనూ బీజేపీ మూడో సారి వ‌చ్చే అవ‌కాశాల‌ను ఎవరూ తోసిపుచ్చ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మోడీ వింత స‌మాధానాలుచెప్పారు. ``మీరు ఇంకెన్నిసార్లు పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు`` అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. ``నేను ఇప్పుడు మూడో సారి గెలుస్తున్నా. 140 కోట్ల మంది ప్ర‌జ‌ల ఆశీస్సులు ఉన్నాయి. కాబ‌ట్టి.. మ‌రో నాలుగు సార్లు 5 సార్ల‌యినా గెలుస్తా. అంతేకాదు.. ఈ దేశాన్ని 2047 వర‌కు పాలిస్తా`` అని మోడీ చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. తాను దైవాంశ సంభూతుడిన‌ని.. ఇత‌ర మ‌నుషుల మాదిరిగా.. త‌న‌కు జీవ సంబంధం లేద‌ని కూడా .. మోడీ వ్యాఖ్యానించారు. నిజానికి ఇవ‌న్నీ.. ఒక దేశ ప్ర‌ధానిగా .. ఎవ‌రూ ఇంత‌కు ముందు చెప్ప‌లే దు. గ‌తంలో వాజ‌పేయిని ఇదే ప్ర‌శ్న అడిగిన‌ప్పుడు.. ``ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారం.. నువ్వు మాకొద్దు.. అని వారు ఇప్పుడు కోరుకున్నా.. త‌క్ష‌ణం దిగిపోతా. ఈ దేశం ముఖ్యం ప‌ద‌వులు కాదు`` అని చెప్పారు. కానీ, దీనికి విరుద్ధంగా లాజిక్ కూడా అంద‌నివిధంగా మోడీ మ‌రో న‌నాలుగు సార్లు 5 సార్లు గెలుస్తాన‌న‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

లాజిక్ ప్ర‌కారం చూసుకున్నా.. ప్ర‌స్తుతం మోడీ వ‌య‌సు 74. మ‌రో ఐదేళ్ల త‌ర్వాత 79.. అప్ప‌టికి బీజేపీ పెట్టుకున్న 75 ఏళ్ల వ‌య‌సు ల‌క్ష్మ‌ణ రేఖ‌ను ఆయ‌న చేరుకుంటారు. కాబ‌ట్టి పోటీకి అన‌ర్హులు అవుతారు. అయినా... పోట చేసినా.. ఇంకోసారి మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. అప్ప‌టికి 84 ఏళ్లు వ‌స్తాయి. కానీ, మోడీ మాత్రం ఇంకా ఇంకా గెలుస్తాన‌ని చెబుతున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పైనే ఇండియా కూట‌మి నాయ‌కులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.. ``ఎండలో తిరిగి ప్ర‌చారం చేయ‌డంతో మోడీకి పిచ్చిప‌ట్టింది. అందుకే ఇలాంటి మాట‌లు చెబుతున్నారు`` అని ఒక‌రంటే.. ``మోడీని త‌క్ష‌ణం... రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆసుప‌త్రిలోని 203వార్డులో(మాన‌సిక చికిత్స‌లు చేసే) చేర్చాలంటూ`` మ‌రికొంద‌రు చెబుతున్నారు.

ఏదేమైనా.. మోడీ కొంత అతిగా అయితే స్పందిస్తున్నార‌నేది విశ్లేష‌కులు కూడా చెబుతున్న మాట‌. గ‌తంలో ఉన్నంత ఇమేజ్ ఆయ‌న‌కు ఇప్పుడు లేద‌ని కూడా అంటున్నారు. అందుకే అస‌హ‌నంతో ఆయ‌న లేనిపోని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒడిశాలోని ప్ర‌సిద్ధ పూరీ జ‌గ‌న్నాథుని ఆల‌య ర‌త్న‌భండాగారం తాళం చెవుల‌ను న‌వీన్‌ప‌ట్నాయ‌క్ ప్ర‌బుత్వం మాయం చేసింద‌న్నారు. తాము అధికారంలోకి వ‌స్తే.. తాళం చెవుల నిగ్గు తేలుస్తామ‌న్నారు. వాస్త‌వానికి ఇవి ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నులు కావ‌ని.. గ‌తంలో కేర‌ళ‌లోని ప‌ద్మ‌నాభ స్వామి.. ర‌హస్య నిధిపై సుప్రీంకోర్టు వ్యాఖ్య‌లు చేసింది. అయినా.. మోడీ ఇలాంటి వాటికే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు.

Tags:    

Similar News