మోడీ ని ఢీకొట్టే 'మొనగాడి' కోసం ఇండియా కూటమి!

ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోడీ.. టెంపుల్ టౌన్‌గా ప్ర‌సిద్ధి చెందిన యూపీలోని వార‌ణాసి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

Update: 2023-12-21 05:21 GMT

టార్గెట్ మోడీ.. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని 18 పార్టీల ఇండియా కూట‌మి ప్ర‌ధాన ల‌క్ష్యం. మోడీని గ‌ద్దె దింప‌డం మాత్ర‌మే కాదు.. ఆయ‌నను కూడా చిత్తుగా ఓడించాల‌నేది ఇండియా కూట‌మి ఇప్పుడు ల‌క్షించుకున్న ప్ర‌ధాన విధానం. దీనికి సంబంధించి పావుల‌ను కూడా వేగంగా క‌దుపుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా జ‌రిగిన స‌మావేశంలో ఈ విష‌యంపైనే చ‌ర్చ జ‌రిగింది.

ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోడీ.. టెంపుల్ టౌన్‌గా ప్ర‌సిద్ధి చెందిన యూపీలోని వార‌ణాసి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 2014, 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డే.. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలోనే మోడీని మ‌ట్టి క‌రిపించాల‌న్న‌ది ఇండియా కూట‌మి పార్టీల ల‌క్ష్యంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై పోటీ చేసేందుకు బ‌ల‌మైన నాయ‌కుల‌ను రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించారు.

వారణాసి నుంచి మోడీ1పై ఎవరు పోటీలోకి దిగాతారనే విషయంలో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. మోడీని ఢీ అంటే ఢీ అంటున్న‌ బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరు ఔనంటే స‌రే.. లేదా ఎన్నిక‌ల స‌మ‌యానికి వీరి గ్రాఫ్‌ను బ‌ట్టి.. వీరిలో ఒక‌రిని ఎంచుకుంటారు. ఒక‌వేళ ఇద్ద‌రూ కాదంటే.. ఢిల్లీ సీఎం ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా ప‌రిశీలిస్తున్నారు.

బీజేపీకి కంచుకోట‌!

వారణాసి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం బీజేపీకి కుంచుకోట. 1991 నుంచి ప్రతి ఎన్నికలోనూ (2004లో మినహా) బీజేపీ ఇక్కడ గెలుస్తోంది. ఇక్కడ నుంచి 60 శాతానికి పైగా ఓట్లను గత రెండు ఎన్నిక‌ల్లోనూ మోడీ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మోడీపై గట్టి అభ్యర్థిని దింపడం ద్వారా టెంపుల్ టౌన్‌పై పట్టుసాధించాలని ఇండియా కూటమి భావిస్తోంది. మ‌రోవైపు.. బీజేపీ త‌న ప‌ట్టును మ‌రింత పెంచుకునేందుకు.. వార‌ణాసిని అద్భుత సుంద‌ర దివ్య‌ధామ న‌గ‌రంగా తీర్చిదిద్దుతున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News