షాడో క్యాబినెట్ - భలే విచిత్రం గా ఉంది!
మోహన్ మాంఝీ నేతృత్వంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏడాది జూన్ 12న మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
దేశ రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికర పరిణామానికి ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెరతీశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వ పనితీరును పరిశీలించిందని, ప్రశ్నించేందుకు ఏకంగా బీజేడీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలతో షాడో క్యాబినెట్ ఏర్పాటు చేశారు.
ఇటీవల జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 79 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 21 మంది ఎంపీలను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. 29 ఫిబ్రవరి 2000 ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ పట్నాయక్ 3 జూన్ 2024 వరకు 24 ఏళ్ల పైచిలుకు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డ్ సృష్టించారు.ఈ నేపథ్యంలో బీజేడీ తరపున గెలిచిన 51 మంది ఎమ్మెల్యేలలో 50 మందికి వివిధ శాఖల పర్యవేక్షణకు బాధ్యతలు అప్పగించారు.
ఒడిశాలో బీజేడీ సుదీర్ఘకాలం పాలన చేసింది. మోహన్ మాంఝీ నేతృత్వంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏడాది జూన్ 12న మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ పరిశీలనకు ఆర్థికశాఖ మాజీ మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు, ప్రతాప్ దేబ్ కు పరిపాలన, ప్రజా ఫిర్యాదుల బాధ్యతలు, మాజీ మంత్రి నిరంజన్ పూజారికి గృహ, ఆహారం, వినియోగదారుల సంక్షేమ శాఖలను పర్యవేక్షణ బాధ్యతలు, ఇలా ప్రతి ఒక్కరికి ఒక విభాగాన్ని అప్పగించడం విశేషం. ప్రధాన ప్రతిపక్షంగా బీజేడీ ఇలాంటి కీలకనిర్ణయం తీసుకోవడం రాజకీయాల్లో కొత్త పరిణామాలకు బాటలు వేస్తుందని భావించవచ్చు.