ప్రజలకు కంగనా కండిషన్... వాయిస్తున్న విపక్షాలు!

రోజు రోజుకీ భారతదేశంలో రాజకీయ నాయకులు అంటే ప్రజా సేవకులు, ప్రజలకు సేవచేయడం వారి అనే విషయం మరిచిపోయి

Update: 2024-07-12 09:46 GMT

రోజు రోజుకీ భారతదేశంలో రాజకీయ నాయకులు అంటే ప్రజా సేవకులు, ప్రజలకు సేవచేయడం వారి అనే విషయం మరిచిపోయి.. ప్రజాస్వామ్యంలో సెలబ్రెటీలు అనే పరిస్థితులు వచ్చేస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సెక్యూరిటీ మాటున పరదాలు కట్టుకుని కొంతమంది తిరిగితే.. పెన్సింగులు కట్టుకుని ప్రజలను మరొకరు కలుస్తున్నారు!

దీంతో రోజు రోజుకీ ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులంతా ప్రజాసేవకులు అనే విషయం మరిచిపోయి తమను తాము వేరే లెవెల్ లో ఊహించుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రజలకు కండిషన్ పెట్టారు. దీంతో... విపక్షాలు కడిగిపారేస్తోన్నాయి.

అవును... బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనారనౌత్ ప్రజలముందు ఓ కండిషన్ ఉంచారు. ఇందులో భాగంగా... తనను కలిసేందుకు వచ్చే ప్రజలు తమ వెంట ఆధార్ కార్డుతో పాటు, ఎందుకు కలుస్తున్నదీ ఓ లేఖలో పేర్కొని తీసుకుని రావాలని అన్నారు. దీంతో ఈ డిమాండ్ పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి.

తాజాఆ మీడియాతో మాట్లాడిన కంగనా... తనను కలిసేందుకు వచ్చే నియోజకవర్గ ప్రజలంతా తమ వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని.. ఇదే సమయంలో తనను ఎందుకు కలవాలనుకుంటున్నారో ఆ కారణాన్ని ఓ కాగితంపై రాసి ఇవ్వాలని ఆమె సూచించారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు కంగనా డిమాండ్ పై ఫైరవుతున్నారు.

ఇందులో భాగంగా... కాంగ్రెస్ నేత, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎంపీని కలుసుకోవాలంటే ఆధార్ కార్డు అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ వర్గానికి చెందిన ప్రజలను కలవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులం అయిన మనపై ఉందని సూచించారు.

పని ఏదైనా సరే... ప్రజలు ఎవరూ ప్రజా ప్రతినిధిని కలవడానికి వచ్చేటప్పుడు వారి వెంట గుర్తింపుకార్డు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని ఆమె కండిషన్ ను తప్పుపట్టారు. ప్రస్తుతం కంగనా పెట్

న కండిషన్ పై నెటిజన్లూ విరుచుకుపడుతున్నారు. ఈ కండిషన్ పెట్టింది ఎంపీగానా, బాలీవుడ్ నటిగానా అని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News