బాబుకు పవన్ : ముద్రగడ జేడీ సడెన్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్...!?
దాన్ని ఒడిసిపట్టే క్రమంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తన వైపునకు చంద్రబాబు తిప్పుకున్నారు.
ఏపీలో కులాలే రాజకీయాలను నిర్దేశిస్తాయి. కులాల సంకుల సమరం ఏపీ రాజకీయమని ఎవరైనా అంటారు. ఇపుడు మరోసారి అదే జరగబోతోంది. ఏపీలో కాపు ఓటు బ్యాంక్ కీలకంగా ఉంటోంది. దాన్ని ఒడిసిపట్టే క్రమంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తన వైపునకు చంద్రబాబు తిప్పుకున్నారు. పవన్ తో పొత్తులకు సై అంటూ ముందుకు సాగుతున్నారు.
దీంతో ఎన్నికల గోదారిని గోదావరి జిల్లాలలో సులువుగా ఈదేయవచ్చు అన్నది బాబు మాస్టర్ ప్లాన్. అది ఓకే అనుకుంటున్న వేళ సడెన్ గా పొలిటికల్ సీన్ లోకి ముద్రగడ పద్మనాభం, జేడీ లక్ష్మీనారాయణ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఇంటలెక్చువల్ పొలిటీషియన్ గా జేడీకి యూత్ మిడిల్ క్లాస్ వర్గాల్లో మంచి ఇమేజ్ ఉంది.
ఇక ఎవరు ఏ పొజిషన్ లో ఉన్న మా వారూ అనుకునే కులం ఎపుడూ ఉంటుంది. అలాంటి నేపధ్యంలో జేడీ కొత్త పార్టీ పెట్టేశారు. జై భారత్ అంటూ ఆయన పెట్టిన పార్టీ ఏపీలో అన్ని చోట్లా పోటీ పడనుంది అని అంటున్నారు. అంటే ఇది ఏపీలో అధికార వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలికకు దారి తీసే పరిణామం అని అంటున్నారు.
అంతే కాదు జేడీ రాజకీయంగా ఫస్ట్ అరగేంట్రం చేసింది జనసేన నుంచే. ఆయన అందులో నుంచే ఎంపీగా పోటీ చేసి దాదాపుగా మూడు లక్షలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. దాంతో జేడీ బ్రాండ్ ఒకటి పొలిటికల్ గా రీ సౌండ్ చేసే చాన్స్ ఉంది అన్నది ప్రూవ్ అయింది. మరో విషయం ఏంటి అంటే జేడీ గత అయిదేళ్ళుగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఆయనకు కులాలు లేవు అని అనుకున్న వారికి విస్మయం కలిగించేలా కాపు నాయకుల మీటింగ్స్ కి పలు మార్లు హాజరై వార్తలలో నిలిచారు. దాంతో పాటు మేధావుల రాజకీయ వేదికల్లోనూ మెరిసారు. ఇక జనసేనలో ఆయన చాలా కాలం ఉండడం వల్ల ఆ పార్టీ వారితో ఆయనకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.
ఇపుడు జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం గిట్టని వారు కానీ అలాగే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూసి టికెట్ దక్కక ఆశాభంగం చెందిన వారు కానీ వైసీపీలోకి వెళ్ళలేని వారికి కానీ కొత్త రాజకీయం కోరుకుంటున్న వారికీ జేడీ పార్టీ ఒక వేదికగా మారనుంది అని అంటున్నారు.
ముఖ్యంగా గోదావరి జిల్లాలలో జేడీ పార్టీ ప్రభావం ఎంత అన్నది కూడా ఒక చర్చను రేకేత్తిస్తోంది. జేడీ కర్నూల్ జిల్లాకు చెందిన వారు. దాంతో రాయలసీమలో కూడా జేడీ పార్టీ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అన్నది మరో కీలక ప్రశ్నగా ఉంది.
ఇంకో వైపు చూస్తే ముద్రగడ పద్మనాభం గురించి చెప్పుకోవాలి. ఆయన కాపులకు ఐకాన్ గా దశాబ్దాలుగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఉద్యమమాలు ఒక స్థాయిలో ఉంటాయి. డూ ఆర్ డై అన్నట్లుగా ఆయన కాపుల కోసం పనిచేశారు. పోరాడారు. అదే ముద్రగడకు చంద్రబాబు అంటే తీవ్ర వ్యతిఎరకత ఉంది. ఇపుడు ముద్రగడ వైసీపీలోకి చేరబోతున్నారు అన్నది మరో సంచలన వార్త.
కొత్త ఏడాది జనవరి వస్తూనే ముద్రగడ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారు అన్నది గోదావరి జిల్లాల మాట. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో ముద్రగడ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. లేకపోతే ఆయన కుమారుడు అయినా పిఠాపురం నుంచి పోటీకి దిగుతారు అని అంటున్నారు
ముద్రగడకు ఉభయ గోదావరి జిల్లాలలో మంచి పట్టు ఉంది. ఆయన పక్కా లోకల్. మా కాపు కాసే నాయకుడు అని భావిస్తారు. టీడీపీతో జనసేన పొత్తుని వ్యతిరేకించే వారు ముద్రగడతో నడుస్తోంది. అలాగే జనసేన నుంచి నేతలను అట్రాక్ట్ చేసే చాతుర్యం ఆయనకు ఉంది అంటున్నారు. అలాగే కాపు ఓటు గుత్తమొత్తంగా టీడీపీకి పోకుండా వైసీపీ వైపు టర్న్ చేసే టాలెంట్ కూడా ఉంది అంటున్నారు.
మొత్తంగా చూస్తే చంద్రబాబు పవన్ మీద ఆశలు పెట్టుకుని పొత్తుతో ముందుకు సాగుతోంది. ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా కాపులు ఉన్నారు. మొత్తం 70 దాకా నియోజకవర్గాలలో గెలుపోటములను శాసించే కాపులు ఈసారి ఎటూ అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది. కాపుల ఓట్లను ఏకపక్షంగా టీడీపీ వైపు వెళ్లకుండా జేడీ ముద్రగడ ఇద్దరూ అడ్డుకుంటే మాత్రం టీడీపీ ఆశలకు చెక్ పడుతుంది అని అంటున్నారు.
ఇక టీడీపీతో జనసేన పొత్తు నచ్చని వారు ఒక సెక్షన్ గా ఉంటే చంద్రబాబే మరోసారి సీఎం అని లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ తరువాత జనసేనకు గట్టి మద్దతుగా ఉన్న మాజీ మంత్రి హరిరామజోగయ్య లాంటి వారిలో కూడా మార్పు కనిపిస్తోంది అని అంటున్నారు. ఇలాంటి రాజకీయ సామాజిక పరిస్థితుల నేపధ్యంలో కాపులు పవన్ లో తమ నేతను కాకుండా జేడీలోనో ముద్రగడలోనో వెతుక్కోవాలని అనుకుంటే మాత్రం భారీ ఓట్ల చీలిక బలమైన సామాజికవర్గంలో రావడం ఖాయం అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.