పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయం...ముద్రగడ జోస్యం...!
దానికి తగినట్లుగా కాపులు పెద్ద సంఖ్యలో ఉన్న పిఠాపురం సీటుని ఎంపిక చేసుకుని పవన్ తనదైన వ్యూహాన్ని రచించారు
కాపులలో పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జోస్యం చెప్పేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలు కావడం ఖాయం అని ఆయన ముందే అపశకునం పలికారు. పవన్ అయితే ఏకంగా లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అంటున్నారు.
దానికి తగినట్లుగా కాపులు పెద్ద సంఖ్యలో ఉన్న పిఠాపురం సీటుని ఎంపిక చేసుకుని పవన్ తనదైన వ్యూహాన్ని రచించారు. అయితే పవన్ ఓటమి కోసం వైసీపీ గట్టిగానే కృషి చేస్తోంది. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారు అని తెలియగానే ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకుంది.
దాంతో ముద్రగడ రంగంలోకి దిగిపోయారు. ఆయన పిఠాపురంలో వివిధ మండలాలలో ఉన్న కాపు నేతలతో అపుడే కీలక సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని గెలిచే పార్టీలో పిఠాపురం ఉండాలని అయన కోరినట్లుగా తెలుస్తోంది.
వంగా గీత గెలిస్తే మంత్రి అవుతారని పిఠాపురం అభివృద్ధి మీద వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుందని ఆయన చెప్పుకొచ్చారని టాక్. అదే టైం లో గంగా గీత పిలిస్తే పలికే నేత అని ఆమె స్థానికంగా ఉంటారని కూడా ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పిఠాపురంలో ముద్రగడకు పట్టుంది. ఆయన 2009లో పోటీ చేస్తే 43 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అలాగే అనాడు వంగా గీతకు 46 వేల ఓట్లు దక్కాయి. ఇక వైసీపీ తరఫున 2019లో పోటీ చేసి గెలిచిన పెండెం దొరబాబుకు 83 వేల దాకా ఓట్లు వచ్చాయి. అదే విధంగా ఈ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన మాకినీడు శేషుకుమారికి 28 వేల ఓట్లు వచ్చాయి. ఇలా లెక్కలు అన్నీ దగ్గర పెట్టుకున్న వైసీపీ లక్షకు తగ్గకుండా తమకు మెజారిటీ వస్తుందని ఊహితోంది.
కాపులలో సగానికి సగం ఓట్లు తమకు దక్కుతాయని మిగిలిన సామాజిక వర్గాలలఒ నూటికి ఎనభై శాతం తమవే అని చెబుతోంది. దాంతో పిఠాపురంలో విజయం ఖాయమని లెక్క వేసుకుంటోంది. ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం కూడా తనదైన అంచనాలతో పవన్ పిఠాపురంలో ఓడిపోతారు అని విమర్శించారు.
తనను నానా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుని పవన్ కలుస్తారా అని మండిపడ్డారు. కాపులకు మోసం చేసిన వారు చంద్రబాబు అని ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన జీవితం నాశనం చేశారని కూదా ఆయన మండిపడ్డారు. అలాంటి చంద్రబాబుతో పవన్ కలవడమేంటి అని ఆయన నిలదీశారు.
ఈ సందర్భంగా ముద్రగడ కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు. తాను కుల ఉద్యమాలు చేయడం ద్వారా రాజకీయంగా భారీ ఎత్తున నష్టపోయాయను అని అన్నారు. ఇక తన జీవితం రాజకీయాల్లోనే అని చెప్పేశారు. అంటే ఒక కులం కోసం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు అన్న మాట.
అంతే కాదు తాను చంద్రబాబు పవన్ ల ఓటమి కోసం కృషి చేస్తాను అని శపధం పట్టారు. ఒకవేళ తాను వైసీపీలో చేరకపోయి ఉంటే కనుక ఇండిపెండెంట్ గా పిఠాపురంలో పోటీ చేసి అయినా పవన్ ని ఓడించేవాడిని అని ఆయన అంటున్నారు.
ఇక పవన్ పిఠాపురంలో ష్యూర్ గా ఓటమి పాలు అవుతారు అని ముద్రగడ అంటున్నారు. ఆరు నూరు అయినా గెలిచేది వైసీపీ అని చెబుతున్నారు. అంతే కాదు ఏపీ సీఎం గా జగన్ మరో ముప్పయ్యేళ్ళ పాటు ఉంటారని కూడా ముద్రగడ మరో జోస్యం చెప్పారు.