యూఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్... మస్క్ కు ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
ఈ నేపథ్యంలో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైన వేళ ఎలాన్ మస్క్ కు వరుసగా భారీ బెనిఫిట్స్ ఒకదాని తర్వాత ఒకటి కలిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ పాత్ర అత్యంత కీలకం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైన వేళ ఎలాన్ మస్క్ కు వరుసగా భారీ బెనిఫిట్స్ ఒకదాని తర్వాత ఒకటి కలిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుతో ఎలాన్ మస్క్ కు వరుస బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన వేళ.. ఎలాన్ మస్క్ సంపద ఇప్పటికే భారీగా పెరిగింది. ఇందులో భాగంగా... 26.5 బిల్లియన్ డాలర్లు (దాదాపు రూ. 2 లక్షల కోట్లు) మేర పెరిగిందని అంటున్నారు.
ఇదే సమయంలో... ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన మస్క్ కు క్యాబినెట్ పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ మేరకు కొన్ని నెలల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యను గుర్తుకు తెస్తున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా... తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే తన మంత్రివర్గంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ను తీసుకుంటామని ప్రకటించారు ట్రంప్.
ఒకవేళ అందుకు వీలు కుదరని పక్షంలో సలహాదారుడిగా నియమించుకుంటానని తెలిపారు. దీంతో... త్వరలో కొలువుదీరనున్న ట్రంప్ కేబినెట్ లో మస్క్ కు ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయని.. అలాకానిపక్షంలో ట్రంప్ సలహాదరుడిగా అయిన మస్క్ వైట్ హౌస్ కు అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. ఇది కచ్చితంగా మస్క్ కు పెద్ద బహుమతే అని అంటున్నారు.
ఇదే సమయంలో... గతంలో కూడా మస్క్ చాలా తెలివైన వాడని కితాబిచ్చిన ట్రంప్... ఈవీ వెహికల్స్ పై ఇస్తున్న క్రెడిట్ ట్యాక్స్ (సుమారు 7,500 డాలర్లు) రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యరు కాబట్టి.. ఆ కార్యక్రమం కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా.. గతంలో ట్రంప్ ఆఫర్స్ పై స్పందించిన మస్క్.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి తాను నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు! ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్దీకరించి, వాటిలో వృధాను అరికట్టే విధంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు!