అంగారకుడిపై నగరం... మస్క్ ఆలోచనల్లో మార్పొచ్చింది!

అవును... అంగారకుడిపై మానవ నివాసాల ఏర్పాటులో ఉన్న అడ్డంకులను తెలియజేస్తూ గతంలో ఎలాన్ మస్క్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-21 12:45 GMT

అంగారకుడిపైకి మరో పదేళ్లలోపే అక్కడకు మనుషులను పంపించగలుగుతామని.. 20 ఏళ్లలో అక్కడ నగరాన్ని నిర్మిస్తామని ఇటీవల మస్క్ ఎక్స్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే... ఇది ఇప్పుడు. కానీ అంగారకుడిపై నివాసం విషయంలో గతంలో మస్క్ ఆలోచనలు పూర్తి భిన్నంగా ఉండేవి. ఈ మేరకు తాజాగా విడుదలైన ఓ పుస్తకంలో ఈ విషయాలు పొందుపరచబడ్డాయి.

అవును... అంగారకుడిపై మానవ నివాసాల ఏర్పాటులో ఉన్న అడ్డంకులను తెలియజేస్తూ గతంలో ఎలాన్ మస్క్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అంగారకుడిపై మానవ కాలనీ ఏర్పాటు చేయకముందే తాను చనిపోతానేమో అనేది ఒకటి. ఈ సందర్భంగా బ్రాడ్ బెర్గాన్ విడుదల చేసిన "స్పేస్ ఎక్స్: ఎలాన్ మస్క్ అండ్ ద ఫైనల్ ఫ్రంటియర్" పుస్తకంలో వివరించాడు.

అంగారకుడిపై మానవ నివాసాల ఏర్పాటులో ఉన్న అడ్డంకులను మస్క్ తెలియజేస్తున్నాయనే చెప్పాలి. అంటే... మరికొన్ని దశాబ్ధాల్లో మనిషి అంగారకుడిపైకి చేరుకొనే అవకాశం ఉన్నప్పటికీ... అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొవడం మాత్రం ఇప్పట్లో సాధ్యంకాదు అనేది మస్క్ అభిప్రాయంగా ఉందన్నమాట. 2020లో జరిగిన శాటిలైట్ కాన్ ఫరెన్స్ లోనే మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... "పురోగతి జోరును పెంచనిపక్షంలో మనం అంగారకుడిపైకి వెళ్లేనాటికి కచ్చితంగా నేను జీవించి ఉండను" అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... ఒకవేళ అద్భుతమైన ఆవిష్కరణలు సాధించగలిగి.. ఒక వ్యక్తి అంగారకుడిపైకి వెళ్లాలనుకుంటే.. సుమారు లక్ష నుంచి ఐదు లక్షల డాలర్ల వరకూ ఖర్చవుతుందని ఎలాన్ మస్క్ నాడు అంచనా వేశారు.

ఇక అంతకంటే ముందు 2017 నాటి మస్క్ అంచనాలను పరిశీలిస్తే... అంగారకుడిపైకి ఓ టన్ను మెటిరీయల్ ను తీసుకునివెళ్లాలంటే లేదా చేర్చాలంటే కనీసం 1.40 లక్షల డాలర్లు ఖర్చవుతుంది. మొత్తం మీద పూర్తిస్థాయిలో వినియోగించుకొనే మానవ నివాసం ఏర్పాటు చేయాలంటే 100 బిలియన్ డాలర్లు అవుతుందని నాడు ఎలాన్ మస్క్ అంచనా వేశారు.

ఇక్కడ సమస్య డబ్బే కాదని.. దానికి తోడు అత్యాధునిక టెక్నాలజీ కూడా ఉంటేనే సాధ్యమని అప్పట్లో అభిప్రాయపడ్డారు. ఇది అంగారకుడిపై నివాసం విషయంలో మస్క్ అభిప్రాయంగా ఉంది. అయితే ప్రస్తుతం మస్క్ అభిప్రాయంలో మార్పు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల అంగారకుడిపై అడుగుపెట్టే విషయంలో చేసిన ట్వీట్ కు మస్క్ ఇచ్చిన రెస్పాన్స్ అందుకు ఉదాహరణ.

ఇందులో భాగంగా... "మరికొన్ని సంవత్సరాల్లో మనం అంగారకుడిపై అడుగుపెడతాం" ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్టుకు స్పందించిన మస్క్... ఐదేళ్లలోపు ఆ గ్రహంపైకి మానరహిత యాత్ర సక్సెస్ అవుతుంది.. 10 ఏళ్లలోపే అక్కడికి మనుషులను పంపగలుగుతాం.. ఇక 20 ఏళ్లలో అయితే ఓ నగరాన్నే నిర్మిస్తాం అని మస్క్ ఎక్స్ లో రాసుకొచ్చారు. అయితే గతంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా మస్క్ వ్యాఖ్యలు ఉండేవి!

Tags:    

Similar News