అప్పటికీ, ఇప్పటికీ ఏం మారింది ముత్తిరెడ్డి ?

తాజాగా సొంత పార్టీకే చెందిన జనగామ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాడిపళ్లి ప్రేమలతారెడ్డి కుమారుడు గాడిపళ్లి రాజేందర్ రెడ్డి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2024-04-14 16:30 GMT

జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నాడు. గతంలో అనేక భూకబ్జాలలో ముత్తిరెడ్డి పేరు మార్మోగింది. సొంత కూతురు రోడ్డు మీద ఆందోళనలకు దిగి అడుగడుగునా ముత్తిరెడ్డిని వెంటాడింది. తాజాగా సొంత పార్టీకే చెందిన జనగామ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాడిపళ్లి ప్రేమలతారెడ్డి కుమారుడు గాడిపళ్లి రాజేందర్ రెడ్డి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జనగామ పోలీసులు కేసు నమోదు చేశారు.

చిటకొడూరు గ్రామ శివారులోన 214 సర్వే నెంబర్‎లో గల ఐదుఎకరాల 17 గుంటల సాగుభూమిని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెందిన 39 సర్వే నెంబర్‎లోకి అక్రమంగా బదలాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జనంగా భూకబ్జా చేయడమే కాకుండా తనపై అక్రమ కేసులు పెట్టించి అనేక ఇబ్బందులకు గుర్తు చేశారని ఈ మేరకు ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో ఈ విషయంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని నిలదీసినందుకు తన కుటుంబ సభ్యులను బెదిరించడంతో పాటు తనను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఆయన అనుచరుడు భూరెడ్డి ప్రమోద్ రెడ్డిపై జనగామ పోలీస్ స్టేషన్లో 447, 427, 506 r/w34 ఐపిసి సెక్షన్ల మీద కేసులు నమోదయ్యాయి.

భూ వివాదాల మూలంగానే ముత్తిరెడ్డిని జనగామ బరి నుండి పక్కకు తప్పించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వడం అక్కడి నుండి ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా అధికారం పోయాక కూడా ముత్తిరెడ్డి వివాదాల్లో ఇరుక్కోవడంతో అప్పుడూ, ఇప్పుడూ ఏ మార్పు లేదని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.

Tags:    

Similar News