మైసూర్ బీజేపీ ఎంపీ గలీజ్ దందా.. అరెస్టు చేసిన అధికారులు

ఈ వ్యవహారంపై విపక్ష నేతలు ఎంత తీవ్రంగా విరుచుకుపడినప్పటికీ.. ఆయన మాత్రం పెద్దగా రియాక్టుఅయ్యింది లేదు.

Update: 2024-01-01 04:05 GMT

మొన్నటికి మొన్న పార్లమెంటులో పొగ బాంబులతో అల్లకల్లోలం చేసి.. దేశ పరువును.. మోడీ సర్కారు ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ ఉదంతంలో పార్లమెంటులోకి వచ్చిన ఆగంతుకులకు పార్లమెంటు భవనంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిఫార్సు లెటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ గురించి తెలిసిందే. కర్ణాటకకు చెందిన ఆయన మైసూర్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వ్యవహారంపై విపక్ష నేతలు ఎంత తీవ్రంగా విరుచుకుపడినప్పటికీ.. ఆయన మాత్రం పెద్దగా రియాక్టుఅయ్యింది లేదు.

తాజాగా ఆయన పేరు వార్తల్లోకి వచ్చింది. దీనికి కారణం ఆయన సోదరుడు విక్రమ్ సింహా చేసిన పాడు పని తెర మీదకు వచ్చింది. కోట్లాది రూపాయిలు విలువ చేసే చెట్లను అడ్డదిడ్డంగా నరికేస్తూ.. పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తున్న అతగాడి గలీజ్ దందా బయటకు వచ్చింది. తాజాగా సెంట్రల్ క్రైం బ్రాంచ్ కు చెందిన అధికారులు ఇతగాడిని అరెస్టు చేశారు.

కర్ణాటక అటవీ శాఖ అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం.. హసన్ జిల్లాలో కోట్లాది రూపాయిలు విలువ చేసే 126 చెట్లను నరికేసిన వైనాన్ని గుర్తించారు. ఈ చెట్ల దుంగల్ని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికే పరారీలో ఉన్న ఎంపీ సోదరుడి కోసం గాలిస్తున్న అధికారుల్ని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్ కోసం సెంట్రల్ క్రైం బ్రాంచ్ ఆధ్వర్యంలోని క్రైం స్క్వాడ్.. అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా గాలింపులు చేపట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూసినప్పుడు.. ఈ తరహా పాపాలు చేసే వారిని ఎలాంటి శిక్ష విధించినా తక్కువే అవుతుందన్న భావన కలుగక మానదు.

Tags:    

Similar News