పవర్ షేరింగ్ పై నాదెండ్ల... చాలా దూరం విసిరేశారు!

దీంతో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వారి మనోభావాలతో పవన్ ఆడుకుంటున్నారని కొందరు, ఎద్దేవా చేస్తున్నారని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.

Update: 2023-12-22 10:05 GMT

ప్రస్తుతం ఏపీలో ఎవరు ఎలా కలిసి వచ్చినా తాము మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ప్రకటించిన అధికార వైసీపీ... ఆ దిశగా వారి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు. ఈ సమయంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ - జనసేన కలిసే పోటీ చేస్తాయని రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకముందు ఈస్ట్ గోదావరి జిల్లాలోని వారాహి యాత్రలో తాను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. అనంతరం వెస్ట్ గోదావరికి వచ్చేసరికి అందుకు అనుభవం అవసరం అని అన్నారు!

దీంతో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వారి మనోభావాలతో పవన్ ఆడుకుంటున్నారని కొందరు, ఎద్దేవా చేస్తున్నారని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. దీంతో ఇటీవల కాలంలో సీఎం ఎవరు అవుతారనే విషయం చంద్రబాబు, తాను కూర్చుని డిసైడ్ చేస్తామని కాస్త స్ట్రాంగ్ గానే ప్రకటించారు. దీంతో ఆ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ నడించింది. ఈ సమయంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్.. సీఎం పదవి విషయంలో సూటిగా స్పందించారు. స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా... "బాబు గారు సీఎం అవుతారు.. సమర్థవంతమైన, అనుభవజ్ఞులైన నాయకత్వం అవసరం అని పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ప్రస్తావించారు.. కాబట్టి ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు" అని లోకేష్ చెప్పారు! అంటే... టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటారని సూటిగా సుత్తిలేకుండా కుండబద్ధలు కొట్టి చెప్పారు లోకేష్ . దీంతో రెండున్నరేళ్ల చొప్పున పవర్ షేరింగ్ చేసుకోవాలని కాపు సామాజికవర్గ నాయకుల నుంచి వినిపిస్తున్న మాట బూడిదలో పోసిన పన్నీరయ్యిందనే కామెంట్లు వినిపించడం మొదలయ్యాయి!

దీంతో తాజాగా ఈ విషయాలపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. తాజాగా ఈ విషయంపై అడిగిన ప్రశ్నకు సమధానమిస్తూ... లోకేష్ చెప్పిన మాటలు పర్టిక్యులర్ గా తాను వినలేదని మొదలుపెట్టారు. అనంతరం... పొత్తులో భాగంగా పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలని, సరైన సమయానికి ఇరు పార్టీల నాయకులు కూర్చుని "శాసనసభా పక్ష సమావేశం" ఏర్పాటుచేసుకుని నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు!

దీంతో “సీఎం అభ్యర్థి” అనే టాపిక్ ని నాదెండ్ల మనోహర్ దూరంగా విసిరేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. శాసనసభాపక్ష సమావేశం అని అంటే... ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన ఇరు పక్షాల ఎమ్మెల్యేలు కూర్చిని సీఎం అభ్యర్థిని డిసైడ్ చేస్తారన్న మాట! అంటే... ఎన్నికలు అయ్యేవారకూ.. పవన్ కల్యాణ్ కు పవర్ షేరింగ్ ఇచ్చే అవకాశం ఉందని ఎవరైనా బలంగా నమ్మితే ఆ కూటమికి మద్దతు తెలపొచ్చని... అలాంటి ఆలోచనలు కానీ, ఆశలు కానీ, ఆశయాలు కానీ లేనివారు లైట్ తీసుకోవచ్చని చెప్పారని అనుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.

సో... ఇకపై కూటమిలో భాగంగా సీఎం అభ్యర్థి ఎవరు? అని ఎవరైనా అడిగితే... “శానసభా పక్ష సమావేశంలో నిర్ణయిస్తారు” అనేది జనసేన సమాధానం అన్నమాట!! అప్పుడు ఓటింగ్ పెడితే... ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ లీడర్ సీఎం అవుతారన్నమాట! కాగా... రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు చంద్రబాబు 20 - 25 సీట్లవరకూ ఇవ్వొచనే కథనాలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే!

Tags:    

Similar News