మెగా బ్రదర్ భారీ చాన్స్ కొట్టేస్తారా ?

ఏపీలో ఫలితాలు ఢిల్లీలో ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.

Update: 2024-05-29 03:48 GMT

ఏపీలో ఫలితాలు ఢిల్లీలో ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఢిల్లీలో కూడా అదే తీరు. అయితే ఎక్కడ ఎవరు గెలుస్తారు అన్న చర్చ ఉండనే ఉంది. ఏపీలో టీడీపీ కూటమికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దానికి బీజేపీ పెద్దలు కూడా దృవీకరిస్తున్నారు. నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేశారు. ఏకంగా 17 నుంచి ఆ పై దాకానే ఎంపీ సీట్లు కూటమి ఖాతాలో పడతాయని కూడా తెలియచేశారు.

అమిత్ షా అంతటి వారు చెప్పడంతో కూటమిలో జోష్ మరింతగా పెరిగింది. ఇక కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యే చాన్స్ ఎవరికి ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది. బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు కన్ ఫర్మ్ అంటున్నారు.

అలాగే టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు మరొకరికి చాన్స్ ఇస్తారని అంటున్నారు. జనసేన నుంచి ఎవరికి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు పోటీ చేస్తున్నారు. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి బాలశౌరిలు గెలిస్తే ఈ ఇద్దరిలో సీనియర్ అయిన బాలశౌరికే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

అయితే ఇక్కడే మెగా ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. ఏపీలో కూటమి కనుక అధికారంలోకి రాకపోతే పవన్ కళ్యాణ్ ని కేంద్రంలోకి తీసుకుని సహాయ మంత్రి పదవి ఇచ్చి ఆయన పాలిటిక్స్ కి కొత్త అర్ధం చెప్పాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. అలా కాకుండా టీడీపీ కూటమి గెలిస్తే పవన్ ఏపీలోనే ఉంటారు.

అపుడు మెగా బ్రదర్ నాగబాబుకు ఈ భారీ చాన్స్ ఉంటుదని అంటున్నారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారు అని అంటున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూసి చివరిలో విరమించుకున్న నాగబాబుకు రాజ్యసభ సీటుని టీడీపీ హామీ ఇచ్చి ఉంది. దీంతో ఆయనకే కేంద్ర మంత్రి పదవి అని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2024 ఎన్నికలు మెగా ఫ్యామిలీలో రాజకీయ దశను మార్చే విధంగా భారీ ట్విస్టులు ఇస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News