శంతను... రతన్ టాటాకు సన్నిహిత మిత్రుడు ఎలా అయ్యాడో తెలుసా?

ఈ సందర్భంగా అసలు వీరిద్ధరి మధ్యా స్నేహం ఎలా మొదలైంది.. ఇంతలా బంధం ఎలా బలపడింది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Update: 2024-10-13 20:30 GMT

దివంగత పారిశ్రామిక దిగ్గజం, భారతరత్నం రతన్ టాటా సన్నిహిత వర్గాల్లో ఒకరైన శంతను నాయుడు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అసలు వీరిద్ధరి మధ్యా స్నేహం ఎలా మొదలైంది.. ఇంతలా బంధం ఎలా బలపడింది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... దివంగత రతన్ టాటా సన్నిహిత వర్గాల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న శంతను నాయుడు గురించి ఇప్పుడు నెట్టింత విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో... అసలు వీరిద్ధరి మధ్యా ఇంత స్నేహం ఎలా చిగురించింది.. ఇంతలా ఎలా బలపడింది.. దానికి గల కారణాలు ఎమిటనే చర్చ తెరపైకి వచ్చింది.

వాస్తవానికి ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత శంతను నాయుడు టాటా గ్రూపులో ఇంటర్న్ గా చేరాడు. ఈ క్రమంలో ఓసారి టాటాకు ఓ లేఖ రశాడు. జంవుతులను, ప్రధానంగా వీధి కుక్కల సమ్రక్షణ విషయంలో శంతను నాయుడు తీసుకొచ్చిన చొరవ వారిద్దరినీ దగ్గర చేసింది. దీని తర్వాత రతన్ టాటా జనరల్ మేనేజర్ గా శంతను నియమితుడయ్యారు.

ఈ క్రమంలో రతన్ టాటా చనిపోయారు. ఈ సమయంలో.. "ఐ కేం అపాన్ ఎ లైట్ హౌస్... ఎ షార్ట్ మెమోయీర్ ఆఫ్ లైఫ్ విత్ రతన్ టాటా" అనే పుస్తకంలో కీలక విషయాలు ప్రస్థావించాడు. ఇందులో భాగంగా... రతన్ టాటాను కలవడానికి వెళ్లే సమయంలో తాను డ్రెస్ కొనడానికి తన జీతంలో సగం ఎలా చెల్లించాడో ఆసక్తికర కథనాన్ని వివరించాడు.

ఇదే క్రమంలో శంతను నాయుడు.. రతన్ టాటాతో తనకున్న అనుభవాల గురించి ఓ పుస్తకం కూడా రాశాడు. ఇందులో తాను ఉన్నత చదువుల కోసం ఇండియా వదిలి అమెరికా వెళ్లెందుకు సిద్ధమైన క్రమంలో... రతన్ టాటాను అభ్యర్థించాలని కోరాడు. దీనికి అనుమతించిన రతన్ టాటా... డిన్నర్ పార్టీకే ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలోనే... టాటాకు ఇష్టమైన బ్రాండ్ బ్రూక్ బ్రదర్స్ షర్ట్ కొని డిన్నర్ పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ షర్ట్ కొనుక్కోడానికి ఏకంగా తన నెల జీతంలో సగం వెచ్చించినట్లు శంతను నాయుడు చెప్పుకొచ్చాడు. అనంతరం... శంతను నాయుడు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.

Tags:    

Similar News