నల్లమిల్లికి అనపర్తి టిక్కెట్ కన్ ఫాం!... పార్టీ వేరంతే..!

ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో తన ఆధిపత్యాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తూనే ఉంటున్నారు

Update: 2024-04-21 07:30 GMT

ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో తన ఆధిపత్యాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తూనే ఉంటున్నారు. తమ వారికి టిక్కెట్లు ఇచ్చుకునే క్రమంలో మిగిలిన రెండు పార్టీలనూ చంద్రబాబు శాసిస్తున్నారు! ఒక్క మాటలో చెప్పాలంటే... తన వారికి టిక్కెట్లు ఇప్పించుకునే విషయంలో బాబు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకుర్చే మరో అంశం తెరపైకి వచ్చింది!

అవును... కూటమిలో భాగంగా జనసేనకు 21, బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించారు చంద్రబాబు. ప్రధానంగా జనసేనకు కేటాయించిన కీలక స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారని.. బీజేపీకి కేటాయించిన స్థానాల్లోనూ టీడీపీ పాతకాపులకే పెద్ద పీట వేశారని చర్చ జరుగుతుంది. ఈ సమయంలో తాజాగా అనపర్తి అంశం తెరపైకి వచ్చింది. ఈ టిక్కెట్ బీజేపీ ఖాతాలో ఉన్నప్పటికీ పొటీ చేయబోయేది మాత్రం టీడీపీ నేతే అని అంటున్నారు!

వివరాళ్లోకి వెళ్తే... తూర్పుగోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నుంచి టీడీపీ తరుపున ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పొత్తులో భాగంగా ఆ టిక్కెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో... బీజేపీ అభ్యర్థిగా శివ‌రామ‌కృష్ణంరాజు పేరును ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం ప్రక‌టించింది. అయినా కూడా ఆయన పట్టువదలని విక్రమార్కుడిలానే నల్లమిల్లి ప్రయత్నిస్తూ.. అదే మాటపై నిలబడ్డారు.

ఈ సమయంలో... బీజేపీ త‌ర‌పున న‌ల్లమిల్లి రామ‌కృష్ణారెడ్డి పోటీ చేస్తార‌నే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... న‌ల్లమిల్లి రామ‌కృష్ణారెడ్డిని త‌మ పార్టీలో చేరాల‌ని బీజేపీ ఆహ్వానించిందని తెలుస్తుంది. దీంతో ఆయన కూటమి జెండాలతో ప్రచారం తీవ్రతరం చేశారని చెబుతున్నారు. దీంతో ఆదివారం నాడు తన అనుచరులతో సమావేశమయ్యి.. నల్లమిల్లి బీజేపీలో చేరడం ఇక లాంచనమే అనే చర్చ తెరపైకి వచ్చింది.

కాగా... వైఎస్సార్ జిల్లాలో బ‌ద్వేలులో బీజేపీ నాయ‌కుడు సురేష్‌ ను పక్కనపెట్టి, టీడీపీ నాయ‌కుడు రోశ‌న్నను అభ్యర్థిగా ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అన‌ప‌ర్తిలో మాజీ సైనికుడు శివ‌రామ‌కృష్ణంరాజును కూడా పక్కనపెట్టి.. టీడీపీ ఇన్‌ చార్జ్ రామ‌కృష్ణారెడ్డికి సీటు ఇచ్చేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని అంటున్నారు. దీంతో... పురందేశ్వరి – పవన్ ల పుణ్యమాని కూటమి మొత్తం పసుపురంగులోకి మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!

ఇదే సమయంలో... చంద్రబాబు తన నేతలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో బీజేపీ, జనసేనలను బాగానే మేనేజ్ చేయగలుగుతున్నారని ఒకరంటే... ఏపీలో బలపడటానికి బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందనే మాటలు వినిపిస్తున్నాయి!!

Tags:    

Similar News