అనపర్తిలో నల్లమిల్లి... తేల్చకపొతే రెండు కీలక సమస్యలు!

దీంతో టిక్కెట్ మారుస్తున్నారా అనే చర్చా తెరపైకి వచ్చింది.

Update: 2024-04-01 06:40 GMT

రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ - బీజేపీ - జనసేనల మధ్య సీట్ల పంచాయతీ అధికారికంగా ముగిసినట్లు కనిపిస్తున్నా.. వాటి తాలూకు ప్రతిస్పందనలు మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు! కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు వల్ల ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను.. కూటమిలోని నేతలే ఓడించే అవకాశాలున్నాయనే చర్చ సైతం తెరపైకి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో టిక్కెట్ మారుస్తున్నారా అనే చర్చా తెరపైకి వచ్చింది.

అవును... కూటమిలోని సీట్ల సర్దుబాటులో భాగంగా తొలుత అనపర్తి నియోజకవర్గాన్ని కేటాయించారు. అయితే అనూహ్యంగా బీజేపీ అభ్యర్థుల ప్రకటన సమయంలో... అనపర్తి స్థానానికి బీజేపీ నేత శివరామకృష్ణంరాజుని ప్రకటించారు. దీంతో... నల్లమిల్లి వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. అనపర్తి కేంద్రంగా తీవ్ర నిరసనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నల్లమిల్లి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనే చర్చ కూడా జరిగింది!

దీంతో... ఇంతకుమించిన గుడ్ న్యూస్ తమకు మరొకటి ఉండదంటూ వైసీపీ శ్రేణులు ముందస్తు సంబరాలకు సైతం ముహూర్తం ఫిక్స్ చేశారనే కామెంట్లు వినిపించాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... నల్లమిల్లి ఇండిపెండెంట్ గా పోటీ చేసే బీజేపీకే ఎక్కువ నష్టం అనే మాటలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కారణం... ఆయన ప్రభావం రాజమండ్రి లోక్ సభ స్థానంపై బలంగా రిప్లెక్ట్ అవుతుందని చెబుతుండటమే!

దీంతో... రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరికి ఇది పెద్ద షాక్ అని అంటున్నారు. దీంతో... చంద్రబాబు రంగంలోకి దిగారంట. ఈ క్రమంలో బాపట్లకు నల్లమిల్లిని రప్పించుకుని బుజ్జగించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాటలను, తన భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఇచ్చిన హామీలను నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లైట్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో అనపర్తిలో బీజేపీ గెలుపు అసాధ్యం అని కూడా చెప్పారని సమాచారం!

దీంతో... అనపర్తి సీటు వ్యవహారంపై తాను కూటమి నేతలతో చర్చిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇదే సమయంలో... ఆ చర్చల అనంతరం నల్లమిల్లికి అనుకూలమైన నిర్ణయమే తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు! మరోపక్క... అనపర్తి టిక్కెట్ వదులుకోవాలంటే... బీజేపీ అదే జిల్లాలో మరో స్థానం కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది! ఇందులో భాగంగా రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ ఇవ్వలనే డిమాండ్ ను బీజేపీ నేతలు తెరపైకి తెచ్చారని సమాచారం.

అందుకు చంద్రబాబు & కో అంగీకరిస్తే... ఆ స్థానానికి సోము వీర్రాజుని అభ్యర్థిగా ప్రకటించే అంశం ఉందనే చర్చా నడుస్తుంది. దీనిపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో.. అనపర్తినే బీజేపీకి కొనసాగింది, రామకృష్ణారెడ్డి విషయంలో లైట్ తీసుకుంటారా.. లేక, సీటు మార్పు చేసి బీజేపీకి మరో స్థానం కేటాయించి, అనపర్తిని నల్లమిల్లికే కేటాయిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరో రెండు రోజుల్లో ఈ అంశంపై ఫైనల్ క్లారిటీ రావొచ్చని అంటున్నారు!

కాగా... నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తండ్రి మూలారెడ్డి అనపర్తిలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తొలిసారిగా 1983లో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీచేసి గెలిచారు. అంటే టీడీపీతో నల్లమిల్లి కుటుంబానికి సుమారు 4 దశాబ్ధాల అనుబంధం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో... ఈ టిక్కెట్ ను బీజేపీకి కేటాయించడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది!

Tags:    

Similar News