షర్మిలకు 200 కోట్ల రూపాయలు ప్యాకేజీ బాబు ఇచ్చారు....!

కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షురాలిగా నియమితురాలు అయిన వైఎస్ షర్మిల మీద వైసీపీ నేతలు తమ విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు

Update: 2024-02-05 18:08 GMT

కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షురాలిగా నియమితురాలు అయిన వైఎస్ షర్మిల మీద వైసీపీ నేతలు తమ విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. అవి శృతి మించుతున్నాయి. ఒక్కోసారి ఏమిటీ వ్యాఖ్యలు అనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా చూస్తే వైసీపీకి చెందిన మాజీ మంత్రి, నెల్లూరుకి చెందిన సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి షర్మిల మీద సంచలన కామెంట్స్ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు 200 కోట్ల రూపాయలు ఇచ్చి మరీ షర్మిలతో ఒప్పందం కుదుర్చుకున్నారు అని నల్లపురెడ్డి హీటెక్కించే కామెంట్స్ చేశారు. ఆ తరువాతనే ఏపీ పాలిటిక్స్ లో ఎంటర్ అయిన షర్మిల జగన్ కి వైసీపీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

నల్లపురెడ్డి అయితే షర్మిల మీద ఒక వైపు ఈ తరహా కామెంట్స్ చేస్తూనే తమకు వైఎస్సార్ కుమార్తెగా జగన్ సోదరిగా షర్మిల అంటే గౌరవం చాలా ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఆమె ఇపుడు బాగా మారిపోయింది అన్న ఫీలింగ్ అయితే తమకు వచ్చింది అని అంటున్నారు. ఆమెలో ఈ మార్పు వెనక చంద్రబాబు హస్తం ఉందని తాము అనుమానిస్తున్నామని అన్నారు.

షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్ లో చిక్కుకున్నారని ఆయన స్పష్టం చేశారు. బాబు ఇచ్చే ప్యాకేజిని తీసుకునే షర్మిల వైసీపీ మీద ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు అని నల్లపురెడ్డి మండిపడ్డారు. ఒక విధంగా చూస్తే నల్లపురెడ్డి చేసినవి తీవ్ర ఆరోపణలుగానే ఉన్నాయి.

ఇప్పటిదాకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదనే ప్యాకేజి ఆరోపణలు వైసీపీ చేస్తూ వస్తోంది. ఇపుడు ఆ జాబితాలోకి షర్మిలను కూడా లాగేశారు అని అంటున్నారు. ఆమె భారీ ప్యాకేజిని తీసుకునే వైసీపీకి ఎదురు నిలిచి విమర్శలు చేస్తోంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే షర్మిల మీద ఏపీ కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు అడపా శేషు కూడా కొద్ది రోజుల క్రితం ఈ తరహా ఆరోపణలు చేశారు. షర్మిలను పట్టుకుని ఆయన న్యూ ప్యాకేజీ స్టార్ అని కూడా కొత్త పేరు పెట్టారు. దానికి కొనసాగింపుగా షర్మిల ప్యాకేజీ తీసుకుంటోంది అని నల్లపురెడ్డి వంటి సీనియర్ నేత ఆరోపించడం అంటే ఆలోచించాలని అంటున్నారు.

రాజకీయాలు ఏపీలో వేడెక్కుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే వైసీపీ ఓట్లలో చీలిక వస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. దాంతో ఆమెని కంట్రోల్ చేసేందుకు వైసీపీ ఈ తరహా కామెంట్స్ వరసబెట్టి చేయిస్తోంది అని అంటున్నారు.

ఇప్పటికే ఈ తరహా ఆరోపణలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో తాను బాధపడుతున్నాను అని షర్మిల అంటూంటే వైసీపీ మాత్రం దానికి మించి దాడి చేసేందుకు రెడీ అవుతోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో వైఎస్ షర్మిల మీద నల్లపురెడ్డి చేసిన ఈ 200 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఆరోపణలు మాత్రం సంచలనం రేపుతున్నాయి.

Tags:    

Similar News