పిలిచినా వెళ్లలేదు.. ఎన్టీఆర్ కే నష్టమా?
కానీ తాతకు తగ్గ మనవడిగా సినిమాల్లో సత్తాచాటుతున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది
నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా రూ.వంద నాణేన్ని తాజాగా ఆవిష్కరించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఈ వేడుక జరిగింది. ఎన్టీఆర్ కొడుకులు- కోడళ్లు, కుమార్తెలు అల్లుళ్లు, మనవలు మనవరాళ్లు.. ఇలా దాదాపు కుటుంబం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కానీ తాతకు తగ్గ మనవడిగా సినిమాల్లో సత్తాచాటుతున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ వేడుకకు రావాలని ఎన్టీఆర్ ను పురందేశ్వరి, చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పిలిచినా వెళ్లకపోవడం ఎన్టీఆర్కే నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా షూటింగ్ కారణంగా ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరు కాలేదని ఆయన వర్గాలు చెబుతున్నాయి. కానీ తాతకు గుర్తుగా ప్రత్యేక నాణేన్ని విడుదల చేస్తుంటే వెళ్లకపోవడం ఎన్టీఆర్కు షూటింగే అడ్డమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన కావాలనుకుంటే షూటింగ్ నుంచి విరామం తీసుకుని వెళ్లి రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మేనత్త పురందేశ్వరికి ఎన్టీఆర్ అంటే ప్రేమ. చాలా సార్లు ఈ విషయాన్ని ఆమె చెప్పారు.
అలాంటిది పురందేశ్వరి పిలిచినా ఎన్టీఆర్ వెళ్లకపోడం చర్చనీయాంశంగా మారింది. నందమూరి కుటుంబానికి దగ్గరగా ఉండాల్సిన ఎన్టీఆర్ ఇప్పుడిలా దూరం కావడం పలు ప్రశ్నలకు దారి తీస్తోంది. ఇప్పటికే టీడీపీకి అంటీముట్టనట్టుుగా ఎన్టీఆర్ ఉంటున్నారు. ఇప్పుడు కుటుంబంతోనూ అలాగే వ్యవహరిస్తారా? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇది ఎన్టీఆర్కే నష్టం చేకూరుస్తోందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.