మేలుకో తెలుగోడా అంటూ భువనేశ్వరి బస్సు యాత్ర !
చంద్రబాబు జైలులో ఉంటున్నారు. పార్టీ చూస్తే నిస్తేజంగా ఉంది. బాబు ఎపుడు బయటకు వస్తారో తెలియడంలేదు.
చంద్రబాబు జైలులో ఉంటున్నారు. పార్టీ చూస్తే నిస్తేజంగా ఉంది. బాబు ఎపుడు బయటకు వస్తారో తెలియడంలేదు. దాంతో ఇపుడిపుడే పార్టీ అయోమయం నుంచి మెల్లగా బయటపడుతోంది. మోత మోగిద్దాం అని పిలుపు ఇచ్చి టీడీపీ శ్రేణులను ఉత్తేజం చేసిన పార్టీ అక్టోబర్ 2 గాంధీ జయంతి వేళ నిరాహార దీక్షలకు పిలుపు ఇచ్చింది.
చంద్రబాబు జైలులో ఆ రోజు దీక్ష చేయనున్నారు. ఇక భువనేశ్వరి రాజమండ్రిలో దీక్ష చేస్తే నారా లోకేష్ ఢిల్లీలో తన పార్టీ ఎంపీలతో దీక్షకు కూర్చోబోతున్నారు. అయితే ఇది చాలదని పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టడానికి రంగంలోకి దిగాలని భువనేశ్వరి సిద్ధం అయ్యారని అంటున్నారు.
దాంతో వారం రోజుల పాటు ఏపీ అంతా భువనేశ్వరి బస్సు యాత్ర ద్వారా పర్యటిస్తారు అని అంటున్నారు. ఈ యాత్ర కోసం ముహూర్తాన్ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో బస్సు యాత్ర స్టార్ట్ అవుతుందని అంటున్నారు.
దాని కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పార్టీ సీనియర్లు ఏపీలోని అన్ని జిల్లాలలోనూ ఈ బస్సు యాత్రతో పాటు సభలు సమావేశాలు ఉండేలా చూస్తున్నారు. భువనేశ్వరితో పాటు టీడీపీ సీనియర్లు కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు. వారంతా ఏపీలో తిరుగుతారు మీటింగులలో ఆమెతో పాటు పాలుపంచుకుంటారు అని అంటున్నారు.
ఇక ఈ బస్సు యాత్రకు బస్సు యాత్రకు మేలుకో తెలుగోడా అన్న పేరు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ మొత్తంగా వారం రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది అని అంటున్నారు. ఈ యాత్ర సందర్భంగా భువనేస్వరి ఏపీ ప్రజలతో తన భర్త నారా చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని చాటి చెబుతారు అని అంటున్నారు.
ఆ విధంగా జనాల మద్దతు పొందడంతో పాటు నిస్తేజంగా ఉన్న పార్టీని యాక్టివ్ చేయడానికి బస్సు యాత్ర ఉపయోగపడుతుందని కూడా ఆలోచిస్తున్నారుట. ఈ బస్సు యాత్ర ఈ నెల 7వ తేదీ తరువాత మొదలవవచ్చు అంటున్నారు. అప్పటికి చంద్రబాబు బెయిల్ విషయం కానీ క్వాష్ పిటిషన్లు కానీ ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. అదే విధంగా నారా లోకేష్ సీఐడీ విచారణ తాలూకా పర్యవసానాలు కూడా తెలుస్తాయని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు కోసం నారా భువనేశ్వరి కొంగు బిగించింది అని అంటున్నారు. ఆమె బస్సు యాత్ర చేస్తే ఏపీలో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.