పోలీసులు వర్సెస్ లోకేష్... రాజోలులో టెన్షన్ టెన్షన్!
టీడీపీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు
టీడీపీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోనసీమలోని నారా లోకేష్ యువగళం క్యాంప్ సైట్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో తన తండ్రిని చూసేందుకు నారా లోకేష్ విజయవాడ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. దీంతో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అవును... తన తండ్రిని నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారనే విషయం తెలుసుకున్న లోకేష్... యువగళం పాదయాత్రను ఆపి, విజయవాడకు బయలుదేరాలని ఫిక్సయ్యారు. ఈలోగా పోలీసులు అక్కడికి వచ్చారు. లోకేష్ ని కదలనీయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు విజయవాడకు బయలుదేరితే శాంతిభద్రతల సమస్య వస్తుందని స్పష్టం చేశారు.
దీంతో, తన తండ్రిని చూసేందుకు వెళ్లనీయకపోవడం దారుణం అంటూ లోకేష్ పోలీసులపై ఫైర్ అయ్యారు. కుటుంబ సభ్యుడిగా అయినా తనకు విజయవాడ వెళ్లే అవకాశమివ్వాలని అడిగారు. అయినప్పటికీ పోలీసులు కుదరదని చెప్పడంతో క్యాంప్ సైట్ వద్ద నేలపై కూర్చున్న లోకేష్ ఇలా నిరసనకు దిగారు.
దీంతో ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో యువగళం క్యాంప్ సైట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాఫ్ సైట్ వద్దకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదే సమయంలో మైకొంతమంది టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్భందం చేస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకుండా తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా ఇలాంటి చర్యలకు ఉపక్రమించినట్లు చెబుతున్నారు. ఇంద్లో భాగంగా... శ్రీకాకుళంలో కూన రవికుమార్, విశాఖపట్నంలో ఎమ్మెల్యే గణబాబు, ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్ లను గృహనిర్బంధంలో ఉంచారు.
ఇదే సమయంలో విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు గుడివాడలో మాజీ మంత్రి కళా వెంకట్రావు, సీనియర్ నేత వెనిగండ్ల రాములుతోపాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.