39 ఏళ్ల తర్వాత పసుపుజెండా ఎగిరింది !

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి టీడీపీ యువనేత నారా లోకేష్ ఘనవిజయం సాధించారు.

Update: 2024-06-04 11:24 GMT

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి టీడీపీ యువనేత నారా లోకేష్ ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేష్ 76, 241 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించాడు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామక్రిష్ణారెడ్డిపై 5 వేల ఓట్ల తేడాతో పరాజయం పొందారు.

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన 1983, 1985 ఎన్నికల్లో మంగళగిరి నుండి టీడీపీ అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వర్ రావు వరసగా రెండు సార్లు విజయం సాధించాడు. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్, 1994లో సీపీఎం, 1999 నుండి 2009 వరకు కాంగ్రెస్ అభ్యర్థులు వరసగా విజయం సాధించారు 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామక్రిష్ణారెడ్డి విజయం సాధించాడు.

గత 39 ఏళ్లుగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురలేదు. ప్రస్తుతం నారా లోకేష్ గెలుపుతో అది సాధ్యం అయింది. గత ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఈ ఎన్నికలలో లోకేష్ కసిగా పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రతో టీడీపీ మరింత బలోపేతం అయింది.

Tags:    

Similar News