అందరూ బామ్మర్దులే .. అన్నట్టుగా బెజవాడ టీడీపీ బాగోతం!
కొన్ని కొన్ని విషయాలు తలుచుకుంటే.. ఇలా కూడా జరుగుతుందా? అనేలా ఉంటాయి.
కొన్ని కొన్ని విషయాలు తలుచుకుంటే.. ఇలా కూడా జరుగుతుందా? అనేలా ఉంటాయి. అందరూ బామ్మర్లే.. కానీ, జలపుష్పాలేమయ్యాయి? అన్నట్టుగా టీడీపీ పరిస్థితి. ముఖ్యంగా బెజవాడ టీడీపీలో మరింత గందర గోళం నెలకొంది. అందరూ పార్టీకి వీర విధేయులే. ఎవరూ కూడా తక్కువ కాదు. అవసరమైతే.. రక్తాలు, ప్రాణాలు కూడా ఇచ్చేసే బ్యాచే! కానీ, నారా లోకేష్‌ను ఆహ్వానిస్తున్న కట్టిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి చింపేశారు.
అయితే.. ప్రత్యర్థి వర్గం వైసీపీ చింపి ఉంటుందని ధర్మ సందేహం రావొచ్చు. కానీ, తూర్పు నియోజక వర్గం పరిధిలోను, సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోనూ ఉన్న ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు కట్టారు. అయితే.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ వైసీపీ నాయకులు ఉన్నప్పటికీ.. వారు ఇంత పనిచేసే సీన్ లేదు. ఈ విషయం అంద రికీ తెలిసిందే. ఎందుకంటే.. వైసీపీలో ఉన్న యువ నాయకుడు ఒకరు ఇప్పటికీ.. నారా లోకేష్‌కు ఫ్రెండే.. సో.. అందుకే మాటల వరకే పరిమితం అవుతారు.
అసలు ఏం జరిగిందంటే.. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం మంగళగిరిలో సాగుతోం ది. ఇది విజయవాడ పరిసరాల్లోకి అడుగులు వేయనుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌ను స్వాగతిస్తూ.. బెం జి సర్కిల్ ను బస్టాండ్ వరకు కూడా.. టీడీపీ నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టారు. అయితే.. వీటిని రాత్రికి రాత్రి `గుర్తు తెలియని`(అలా ప్రచారం) వ్యక్తులు చింపేశారు. దీంతో నారా లోకేష్ విజయవాడలో పర్యటించేందుకు ఎవరికో ఇష్టం లేదనే టాక్ పార్టీలోనే వినిపిస్తోంది.
ఇదిలావుంటే, నారా లోకేష్ విజయవాడ పార్లమెంటు పరిధిలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ బాధ్యతల ను ఎంపీ కేశినేని నానికి కాకుండా.. ఆయన సోదరుడు, వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశిస్తున్న కేశినేని చిన్నీకి చంద్రబాబు అప్పగించారు. దీంతో ఆయన చెలరేగిపోయి.. నగరం మొత్తం నలుమూలలా ఫ్లెక్సీలు కట్టించారు. అంతే.. తెల్లారే సరికి మొత్తం మటుమాయం!! మరి ఎవరు చేయించారబ్బా!!! అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పొరుగు పార్టీపైకి తోసేయాలని అనుకున్నా.. సాధ్యం కావడం లేదని కొందరు అంటున్నారు.