రతన్ టాటాను షాక్ కు గురి చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

ఆయితే.. ఇలాంటివి మిగిలిన కంపెనీలకు వర్తిస్తాయి కానీ టాటాకు మాత్రం కాదు.

Update: 2024-10-13 04:34 GMT

దేశంలో చాలానే వ్యాపారసంస్థలు.. పారిశ్రామికవేత్తలు ఉన్నప్పటికీ.. తన ప్రత్యర్థి విషయంలో మరే వ్యాపారవేత్త ఆలోచించని విధంగా ఆలోచించిన క్రెడిట్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి ఉంటే.. తన తీరుతో రతన్ టాటాను అప్పట్లో సర్ ప్రైజ్ షాక్ కు గురి చేసిన వైనాన్ని తాజాగా వెల్లడించారు. ఆయన మరణంపై యావత్ దేశం శోకంతో ఉండిన వేళ.. రతన్ టాటాతో తనకున్న అనుబంధం గురించి.. ఒక ఘటన గురించి ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. సాధారణంగా ఐటీ రంగంలో ఇన్ఫోసిస్.. టీసీఎస్ కు మధ్య పోటీ తీవ్రత ఎక్కువన్న సంగతి తెలిసిందే.

ఆయితే.. ఇలాంటివి మిగిలిన కంపెనీలకు వర్తిస్తాయి కానీ టాటాకు మాత్రం కాదు. తాజాగా ఆ విషయాన్ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తే స్వయంగా వెల్లడించారు. 2004లో తనకు రతన్ టాటాకు మధ్య జరిగిన ఆసక్తికర ఘటనను గుర్తు చేసుకున్నారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ఇన్ఫోసిస్ లో జంషెడ్ జీ టాటా రూమ్ ను ప్రారంభించేందుకు రతన్ టాటాను ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఆహ్వానించగా.. ఆయన ఆశ్చర్యపోయారన్నారు.

ఇన్ఫోసిస్ కు టీసీఎస్ (టాటా కన్సెల్టీన్సీ సర్వీసెస్) పోటీదారుగా ఉన్నప్పటికీ తనను ఎందుకు ఆహ్వానించారు? అన్న సందేహాం రతన్ టాటాకు కలిగింది. అదే విషయాన్ని నారాయణమూర్తిని అడిగేశారు. రతన్ టాటా డౌట్ కు నారాయణమూర్తి ఎంతో గౌరవంగా.. మర్యాదపూర్వకంగా.. ‘‘జంషెడ్ జీ టాటా కంపెనీలకు అతీతమైనవారు. గొప్ప దేశభక్తుడు. ఇన్ఫోసిస్ ను టాటా గ్రూప్ ను పోటీదారుగా మేం ఎప్పుడూ భావించలేదు. రతన్ టాటా వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు ఆ గదిని ప్రారంభించేందుకు ఆహ్వానం పలికా’ అని తాను వివరించినట్లు పేర్కొన్నారు.

తమ ఇన్విటేషన్ ను రతన్ టాటా మన్నించారని.. ఆ కార్యక్రమం తనకో మంచి గుర్తుగా మారినట్లుగా నారాయణమూర్తి పేర్కొన్నారు. రతన్ టాటాకు కాస్త సిగ్గు పడే స్వభావం ఉందని.. దీంతో అప్పుడు సుదీర్ఘ స్పీచ్ ఇచ్చే మూడ్ లేరన్నారు. అయితే.. రతన్ టాటా ట్రిప్ తమ టీమ్ మీద చాలా ప్రభావాన్నిచూపినట్లుగా పేర్కొన్నారు. రతన్ టాటా వినయం.. దయ.. ఆయనో గొప్ప దేశభక్తుడిగా పేర్కొన్నారు. తన వ్యాపార ప్రత్యర్థి మనసును సైతం గెలుచుకున్న విలక్షణ వ్యక్తిత్వం రతన్ టాటా సొంతంగా చెప్పాలి.

Tags:    

Similar News