వారితో విందు.. అతడి కోసం ఏకంగా నేల మీద కూర్చున్న మోడీ

అవును.. ఎప్పుడేం చేయాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలిసినంత ఎక్కువగా మరెవరికి తెలీదని చెప్పాలి.

Update: 2024-09-13 04:57 GMT

అవును.. ఎప్పుడేం చేయాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలిసినంత ఎక్కువగా మరెవరికి తెలీదని చెప్పాలి. తన మేజిక్ తో తనను వ్యతిరేకించే వారి మనసుల్ని సైతం దోచుకుంటారు. తాజాగా మరోసారి తనదైన మేజిక్ ను ప్రదర్శించారు ప్రధానమంత్రి. ఇటీవల ముగిసిన పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్లను ప్రధానమంత్రి మోడీ అభినందించారు. తన ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారితో ముచ్చటించటమే కాదు..వారితో కలిసిపోయారు. వారి మనసుల్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయటమే కాదు..వారిలో మరింత స్ఫూర్తిని నింపారు. గెలుపు కోసం మరింత కసిగా కష్టపడాలన్న భావనకు గురయ్యేలా చేశారని చెప్పాలి.

పతకాలు సాధించిన ప్రతి ఒక్కరిని వారి పేరుతో పిలుస్తూ వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. వారందరితో మాట్లాడిన ప్రధానమంత్రికి.. వారు కోరుకున్నట్లుగా ఫోటోలు దిగటం.. ఆటో గ్రాఫులు ఇవ్వటం లాంటివి చేశారు. ప్రధానమంత్రి మోడీకి కొందరుక్రీడాకారులు తమ వెంట తెచ్చిన బహుమతుల్ని అందించారు. పారిస్ పారా ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శించిన భారత్ క్రీడాకారులు మొత్తంగా 7 స్వర్ణాలు.. 9 రజతాలు.. 13 కాంస్యాలతో మొత్తం 29 పతకాల్ని సాధించారు. ఓవరాల్ గా పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలవటం విశేషం. రెండు బంగారు పతకాలు సాధించిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ తో మోడీ సరదాగా మాట్లాడిన వైనం అక్కడి వారిని నవ్వుల్లో ముంచెత్తింది.

మొత్తంగా క్రీడాకారులతో కలిసి పోయిన ప్రధాని మోడీ.. తన హోదాను పక్కన పెట్టేసి.. ఒక క్రీడాకారుడి కోసం నేల మీద కూర్చున్న వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.నిజానికి.. ఇలాంటివే ప్రధాని మోడీని ప్రత్యేకంగా నిలుపుతాయని చెప్పాలి. సరదాగా జరిగినఈ ఉదంతం కార్యక్రమం మొత్తానికి హైలెట్ గా మారింది. బంగారు పతకాలు సాధించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నప్ దీప్ సింగ్.. మరుగుజ్జు కావటంతో.. అతనితో మాట్లాడటానికి వీలుగా ప్రధాని మోడీ నేల మీద కూర్చున్నారు.

ఈ సందర్భంగా తాను తెచ్చిన క్యాప్ ను స్వయంగా తన తల మీద పెట్టమని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా అతడ్ని ఉద్దేశిస్తూ.. ఇప్పుడు నువ్వు నాకంటే పొడుగ్గా ఉన్నట్లు అనిపింస్తోందా? అంటూ సరదా వ్యాఖ్య చేవారు. ఆ తర్వాత అతడి కోరిక మీద.. స్వర్ణ పతకాన్ని సాధించటానికి త్రో చేసిన ఎడమ చేతిమీదమోడీ తన ఆటో గ్రాఫ్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పారాఒలింపిక్స్ లో దేశానికి వన్నె తెచ్చిన దివ్యాంగ క్రీడాకారులతో కలిసిపోవటం.. వారితో సరదాగా గడపటం ద్వారా.. అందరి మనసుల్ని దోచేవారు మోడీ. మరి.. మోడీ మేజిక్కా? మజాకానా?

Tags:    

Similar News