మోడీ అవ్యాజమైన ప్రేమను చూస్తే కనుక...!

నరేంద్ర మోడీ ఒక ఆవు దూడను అతి చిన్న వయసులో ఉన్న దానిని తన ఓడిలోకి తీసుకుని లాలిస్తూ దాని తల నిమురుతూ అవ్యాజమైన ప్రేమనే కురిపించారు.

Update: 2024-09-14 07:46 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాధారణంగా ఎపుడూ ధీర గంభీర వదనంతో కనిపిస్తారు. ఆయనలో నవ్వును చూస్తారు కానీ ఆయనలో మిగిలిన ఎమోషన్స్ ని చాలా కోణాలను చూసే అవకాశం దేశ ప్రజలకు అయితే లేదు. ఎందుకంటే ఆయన బహిరంగ సభలలో మాట్లాడేటపుడు సదస్సులలోనే ఎక్కువగా కనిపిస్తారు కాబట్టి.

ఇక పార్లమెంట్ లో మోడీ మాట్లాడేటపుడు కూడా ఆయనలోని మరి కొన్ని ఎమోషన్స్ చూడవచ్చు. అయితే మోడీ లోపల మోడీని చూసేందుకు అతి తక్కువగానే అవకాశం ఉంది. అలాంటిదే ఒకటి ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బీజేపీకి గోవుల పట్ల మమకారం ప్రేమ ఎక్కువ అన్నది తెలిసిందే. నరేంద్ర మోడీ ఒక ఆవు దూడను అతి చిన్న వయసులో ఉన్న దానిని తన ఓడిలోకి తీసుకుని లాలిస్తూ దాని తల నిమురుతూ అవ్యాజమైన ప్రేమనే కురిపించారు.

మోడీ లోపలి మనిషిలి ఇంతలా ఉంటారా అనిపించేలా ఆ వీడియో ఉంది. మోడీ ఆవు దూడను తన పూజా మందిరంలోకి తెచ్చారు. దానికి మెడలో పూల దండ వేశారు. వస్తాన్ని కప్పారు. ఆ మీదట తన ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దాడారు. దాని శరీరమంతా నిమురుతూ నిండైన అభిమానాన్నే చూపించారు. దాని నుదుటన నామాన్ని దిద్దారు.

ఆ ఆవు దూడ కూడా మోడీని ప్రేమగా చూస్తూ ఆయన బుగ్గ మీద ముద్దులు పెడుతూ పరవశించింది. మోడీ అయితే దాని తలను అలా నిమురుతూ అలా తెలియని అనుభూతిలో మునిగితేలారు. దానిని అలా అలా తన కుడి చేత్తో ఎత్తుకుని తన నివాసంలోని గదులలో నడుస్తూ ముందుకు సాగారు.

అంతే కాదు పచ్చని తోటలోకి తెచ్చి ముచ్చట చేశారు. గార్డెన్ లో దానిని ఎత్తుకుని మరీ పరవశించారు. అలా దానిని తిరిగి పచ్చిక బయళ్ళలో అతి సుతారంగా సున్నితంగా వదిలిపెట్టారు. ఇస్ట్రా గ్రాం లో మోడీ వీడియో ఇపుడు ఆయన అభిమానులతో పాటు దేశ ప్రజలను అందరినీ కూడా ఆకట్టుకుంటోంది.

మోడీలోని ప్రేమ మూర్తిని చూస్తున్నామని చాలా మంది నెటిజన్లు అంటున్నారు. ప్రకృతి పట్ల మూగ జీవుల పట్ల ఆయనకు ఉన్న అంతులేని అభిమానానికి ఇది నిదర్శనం అని కూడా నెటిజన్లు అంటున్నారు. భారత పౌరులైనందుకు మేమంతా గర్విస్తున్నాం, ధన్యవాదాలు ప్రధానమంత్రి గారూ అని కూడా నెటిజన్లు అంటున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మోడీలోని ప్రేమ ఎంతటి స్వచ్చమైనదో అవ్యాజమైనదో అని కూడా నెటిజన్లు అంటున్నారు.

జంతువుల పట్ల మరీ ముఖ్యంగా మూగ జీవుల పట్ల ఎంతటి ప్రేమను కలిగి ఉండాలన్నది మోడీ వీడియో ద్వారా తెలియచేసి దేశ పౌరులకు స్పూర్తిగా నిలిచారు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సూపర్ అనే అంటున్నారు. దాంతో వ్యూస్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి.

Tags:    

Similar News