మోడీ 3.0 కేబినెట్ లో 30 మంది... కీలక శాఖలు వీరికే?

ఈ క్రమంలోనే మోడీతో కలిసి సుమారు 30 మంది ప్రమాణస్వీకారం చేయొచ్చని తెలుస్తుంది. ఇక ఈ రోజు సాయంత్రం 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది.

Update: 2024-06-09 04:51 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జూన్ 1న ముగియడం, జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడటం, ఆ ఫలితాల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం తెలిసిందే. ఈ క్రమంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇందులో భాగంగా నేడు సాయంత్రం ఈ ప్రమాణస్వీకార మహోత్సవం జరగబోతోంది. ఈ సమయంలో మోడీతోపాటు 30 మంది ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అంటున్నారు.

అవును... ఈ రోజు సాయంత్రం హస్తినలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న రెండో వ్యక్తిగా రికార్డ్ నెలకొల్పనున్నారు మోడీ. ఈ సమయంలో ఏర్పడబోయే మోడీ 3.0 కేబినెట్ కోసం కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేయబోతుంది. దీంతో ఏ పార్టీ నుంచి ఎంతమంది, ఎవరెవరు కేంద్రమంత్రులవుతారనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ సమయంలో ఎన్డీయేలో కీలక భూమిక పోషిస్తున్న చంద్రబాబు టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ ఎ.జే.పీ మధ్య కీలక మంత్రివ శాఖలు, పోర్ట్ ఫోలియోలు ఎవరికి లభిస్తాయనేది ఆసక్తిగా మారింది. అయితే... హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, పౌర విమానయాన వంటి కీలక శాఖలను మాత్రం బీజేపీ తనవద్దే ఉంచుకోబోతుందని అంటున్నారు. వీటిని మిత్రపక్షాలకు ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

ఇక కూటమిలో భాగమైన వివిధ రాజకీయ పార్టీల నుంచి వేర్వేరు డిమాండ్ లు ఉన్నప్పటికీ ప్రధానంగా మంత్రిత్వ శాఖల విషయంలోనూ పలు డిమాండ్స్ వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఏపీలో టీడీపీ కి రెండు మంత్రిత్వ శాఖలు, రెండు సహాయ మంత్రిత్వ శాఖలు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో.. నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) కి రెండు బెర్త్ లు కన్ ఫాం అయ్యాయని అంటున్నారు.

ఈ క్రమంలోనే మోడీతో కలిసి సుమారు 30 మంది ప్రమాణస్వీకారం చేయొచ్చని తెలుస్తుంది. ఇక ఈ రోజు సాయంత్రం 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతోపాటు.. ఈ రోజు ఢిల్లీని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించారని తెలుస్తుంది.

Tags:    

Similar News