ప‌నిచేయ‌ని మోడీ ఫేమ్‌.. నిజం !

ఇక‌, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ప్ర‌ధాని మోడీ ఫేమ్‌ను న‌మ్ముకునే బీజేపీ రాజ‌కీయంగా దూసుకువెళ్లింది

Update: 2024-06-05 23:30 GMT

2014 త‌ర్వాత జ‌రిగిన రెండు ప్ర‌ధాన ఎన్నిక‌లు బీజేపీకి అత్యంత కీల‌కం. 2014లో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న మోడీని తీసుకువ‌చ్చి ప్ర‌ధాని ప‌ద‌వికి ప్ర‌మోట్ చేశారు.దేశ‌వ్యాప్తంగా ఆయ‌న‌ను ప‌రిచ‌యం.. చేశారు. అప్ప‌ట్లో పొత్తులు పెట్టుకుని ముం దుకు సాగారు. భారీ విజ‌యాన్ని న‌మోదు చేశారు. అప్ప‌ట్లో మోడీ ప్ర‌భావం క‌నిపించింద‌ని అన్నారు. అయితే.. ఆ త‌ర్వాత‌.. 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల‌లోనూ.. ప్ర‌ధాని మోడీని ముందు పెట్టుకుని ఎన్డీయే కూట‌మి ఎన్నిక‌ల‌కు వెళ్లింది. అయితే.. ఆ ఎన్నికల్లోనూ విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇక‌, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ప్ర‌ధాని మోడీ ఫేమ్‌ను న‌మ్ముకునే బీజేపీ రాజ‌కీయంగా దూసుకువెళ్లింది. దేశానికి ఉత్త‌మ ప్ర‌ధాని, విశ్వ‌గురు.. విక‌సిత భార‌త్‌కు రూప‌క‌ర్త‌.. అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ముగిసిన ఎన్నిక ల్లో 400 సీట్ల‌ను రాబ‌ట్టాల‌ని బీజేపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. అందులోనూ.. బీజేపీ ఒంట‌రిగానే 370 సీట్ల‌ను ద‌క్కించుకుంటుంద‌ని కూడా.. ధీమా వ్య‌క్తం చేశారు. అభ్య‌ర్థుల ఎంపిక నుంచి ప్ర‌చారం వ‌ర‌కు కూడా.. ఈ 370 ఆ 400 స్థానాల‌ను దృష్టిలో పెట్టుకునే ముందుకు సాగారు. ఎలా చూసుకున్నా.. తాజా ఫ‌లితంలో ఎక్క‌డా బీజేపీ 300 సీట్లు కూడా దాటలేదు. ఒంట‌రిగా 140, కూట‌మి కి 293 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి.

వ‌రుస‌గా మూడోసారి అదికారం అయితే.. ద‌క్కింది. కానీ, మోడీ ఫేమ్‌.. ఆయ‌న హ‌వా ఎక్క‌డా పెద్ద‌గా క‌నిపించ‌లేదు. అదే ఉండి ఉంటే..యూపీలో అయోధ్య రామ‌మందిరాన్ని నిర్మించిన నియోజ‌క‌వ‌ర్గం ఫైజాబాద్‌లోనే బీజేపీ భారీ మెజారిటీతో గెలిచి ఉండాలి. కానీ, అక్క‌డ బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక‌, వార‌ణాసిలో అప్ర‌తిహ‌తంగా మోడీకి మెజారిటీ వ‌చ్చి ఉండాలి. కానీ, అక్క‌డ కూడా. .ప్ర‌ధాని తొలి నాలుగు రౌండ్ల ఎన్నిక‌ల కౌంటింగ్‌లోనూ త‌డ‌బ‌డ్డారు. ఒకానొక ద‌శ‌లో 6 వేల ఓట్ల తేడాతో వెన‌క్కి వెళ్లారు. ఇక‌, గుజ‌రాత్‌లోనూ.. ఆశించిన సీట్లు రాలేదు. ఎటొచ్చీ.. ఏపీలో మాత్రం ఎన్డీయే కూట‌మికి క‌లిసి వ‌చ్చింది.. ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల ఇమేజ్‌తో పాటు యాంటీ జ‌గ‌న్ ప్ర‌భావం.

తెలంగాణ విష‌యాన్ని చూసుకున్నా.. బండి సంజ‌య్ వంటివారు ఒంటరిగానే నెగ్గుకురాగ‌ల నాయ‌కులు. ఫైర్ బ్రాండ్ నేత‌లు. పైగా.. మోడీని మించిన రాజ‌కీయం చేయ‌గ‌ల నేర్ప‌రులు. ఇక‌, త‌మిళ‌నాడులో తీసుకుంటే.. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామ‌లైను గెలిపించుకునేందుకు మోడీ.. మూడు సార్లు త‌మిళ‌నాడుకు వెళ్లారు. రోడ్ షోలు చేశారు. కోయంబ‌త్తూరును డెవ‌ల‌ప్ చేస్తామ న్నారు. కానీ, ఫ‌లితం క‌నిపించ‌లేదు. ఆయ‌న చిత్తుగా ఓడిపోయారు. ఇక‌, చెన్నై సౌత్ నుంచి బ‌రిలో ఉన్న తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై కూడా.. మోడీ ఫొటో ప‌ట్టుకుని ఇంటింటికీ తిరిగారు. కానీ, ఫ‌లితం ద‌క్క‌లేదు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మోడీ ఫేమ్‌, హ‌వా ఎక్క‌డా కూడా.. పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేద‌నే చెప్పాలి.

Tags:    

Similar News