హ్యాట్రిక్ కాదు .. డబల్ హ్యాట్రిక్ కొడతా

చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై దిగిన ప్రదేశానికి శివశక్తి అన్న పేరు పెట్టాం. ప్రపంచానికి భారత్ ఓ తత్వాన్ని పరిచయం చేసింది.

Update: 2024-05-25 04:57 GMT

" దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1952, 1957, 1962 ఎన్నికల్లో గెలిచి వరుసగా మూడు సార్లు ప్రధానిగా చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అలాగే మోదీ కూడా మూడు సార్లు కాదు. ఏడుసార్లు గెలవచ్చు. కానీ ఎన్ని సార్లు ప్రధానిగా పనిచేశాం అన్నది ముఖ్యం కాదు. దేశం ఎంతగా అభివృద్ధి చెందిందన్నది ముఖ్యం. 140 కోట్ల ప్రజల ఆశీస్సులు నాకున్నాయి, కాబట్టి ఇది కొనసాగుతూనే ఉంటుంది" అని ప్రధానమంత్రి మోడీ అన్నారు. నెహ్రూ రికార్డును సమం చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇవ్వడం విశేషం.

"భారత విజయాలను చూసి మనం గర్విస్తున్నామా అంటే అసలు ఈ విజయాలను చూసి గర్వించడంలో తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు. మోదీ క్రెడిట్ ఎందుకు తీసుకుంటున్నారని వాళ్లు అంటారు. ఈ విజయాలను చూసి సంతోషించకుండా క్రెడిట్ మొత్తం తమకే చెందాలని వారు కోరుకుంటున్నారు. చంద్రయాన్ - 2 విఫలమైనప్పుడు ఆ బాధ్యత తీసుకునేందుకు నేను సైంటిస్టుల పక్కనే ఉన్నాను. అక్కడి నుంచి పారిపోలేదు" అని మోడీ అన్నారు. అటల్ బీహారీ వాజ్‌పేయ్ అధికారంలో ఉన్నప్పుడు అణుబాంబు ప్రయోగం నిర్వహించాం. అప్పట్లో శాస్త్రవేత్తలు ఇదంతా చేశారని ప్రతిపక్షం అన్నది. ఆ తరువాత 13 రోజులకు మరో అణువిస్ఫోటనం చేశాం.

చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై దిగిన ప్రదేశానికి శివశక్తి అన్న పేరు పెట్టాం. ప్రపంచానికి భారత్ ఓ తత్వాన్ని పరిచయం చేసింది. కాబట్టి విశ్వాన్ని మొత్తం నడిపించే శివశక్తి పేరు పెట్టడంపై నేను గర్వపడుతున్నాను. 140 కోట్ల మంది ప్రజలకు చేరువయ్యే పేరిది. అదే కుటుంబం పేరు పెట్టి ఉంటే కేవలం కొందరికి మాత్రం కనెక్ట్ అయ్యి ఉండేది. ప్రతిపక్షం అధికారంలో ఉండి ఉంటే వారి కుటుంబం పేరు పెట్టేవారు. కానీ నేను అలా చేయలేను అని మోడీ చెప్పడం విశేషం.

Tags:    

Similar News