జగన్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన సీపీఐ నారాయణ!
ఈ అంశంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం స్పందించడంతో.. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన సబ్జెక్ట్ గా మారిందని అంటున్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడం.. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరడం జరిగిపోయింది. అయితే... గతంలో ఎన్నడూలేని స్థాయిలో అన్నట్లుగా ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎం లపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ అంశంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం స్పందించడంతో.. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన సబ్జెక్ట్ గా మారిందని అంటున్నారు.
ప్రస్తుతం ఈవీఎం ఓటింగ్ కు సంబంధించిన చర్చ విపరీతంగా సాగుతుందని అంటున్నారు. ప్రధానంగా ఏపీలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈవీఎంలపై పలు సందేహాలు వ్యకపరుస్తున్నారు. ఈ విషయంపై చర్చ జరగాలన్నట్లుగా ఆయన రాజకీయ పార్టీల అధినేతలనూ, ప్రభుత్వ పెద్దలను, రాజ్యాంగ సంస్థలనూ కోరుతున్నట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో టీడీపీ నుంచి జగన్ కు ఎదురవుతున్న సెటైర్ల సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా ఈవీఎం లకు సంబంధించి నడుస్తున్న చర్చలో కమ్యునిస్టులు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా దాదాపు ప్రతీ విషయంపైనా తనదైన శైలిలో స్పందించే సీపీఐ నారాయణ.. ఈ విషయంపై స్పందించారు.
అవును.. దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్త ప్రభుత్వాలు సైతం ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే... ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోన్న నేపథ్యంలో... ఈవీఎంల వినియోగంపై సీపీఐ నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా తాజాగా స్పందించిన నారాయణ... ప్రపంచ వ్యాప్తంగా సుమారు 122 దేశాల్లో ఈవీఎంల వినియోగించడం లేదని తెలిపారు.
ఇదే సమయంలో... ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. అయితే... మనదేశంలో మాత్రం ఈవీఎంలపై చర్చకు వస్తున్న అనుమానాలు, ఆరోపణలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇదే సమయంలో... పేపర్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నికలను జరపాలని ఈ సందర్భంగా సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు!