సీబీఐ అసమర్థతను ఎండగట్టిన జాతీయ స్థాయి ఇంగ్లిష్ వెబ్ సైట్ ది వైర్
వైఎస్ వివేకానందరెడ్డి. మాజీ మంత్రి, వైఎస్ కుటుంబీకుడు. కీలకమైన ఆయన హత్య కేసులో సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు చూస్తే చివరికి ఈ కేసులో ఏమి తేల్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి. మాజీ మంత్రి, వైఎస్ కుటుంబీకుడు. కీలకమైన ఆయన హత్య కేసులో సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు చూస్తే చివరికి ఈ కేసులో ఏమి తేల్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఈ కేసు మీద జాతీయ స్థాయి ఇంగ్లిష్ వెబ్ సైట్ ది వైర్ కధనం ఇపుడు వైరల్ అవుతొంది.
ఈ కేస్దులో సీబీఐ ఏమి తేల్చింది అంటూ ఈ కధనం సాగింది. నాలుగేళ్ళు పూర్తి అయి అయిదవ ఏడాదిలోకి అడుగు పెట్టినా ఈ హత్య కేసులోని మూలాలను సీబీఐ తేల్చలేకపోయిందా అన్నట్లుగా ది వైర్ కధనం సాగింది. ఇక ఈ కేసు దర్యాప్తులో కూడా పూర్తి స్థాయిలో గందరగోళం ఉందని పేర్కొనడమూ విశేషం అంటున్నారు.
వివేకా హత్య కేసు కంటే ముందు వైఎస్సార్ మరణం నుంచి కూడా వైర్ వెబ్ సైట్ రాసుకొచ్చింది. అందులో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉనాయి. వైఎస్సార్ మరణాంతరం కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు రావడం వివేకా కాంగ్రెస్ లోనే ఉంటూ మంత్రి కావడం, ఆ తరువాత ఆయన ఏకంగా పులివెందులలో తన వదిన విజయమ్మ మీద పోటీ చేసి ఓటమి పాలు కావడం వంటి ఫ్లాష్ బ్యాక్ కధనాలు రాసుకొచ్చింది.
ఇక వివేకా ఓడిన తరువాత కాంగ్రెస్ లో ఆయనకు గౌరవం తగ్గడంతో జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలోనే ఆయన చివరికి చేరారు. అలాగే 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి పాలు అయ్యారు. దానికి కారణం వైఎస్ భాస్కరరెడ్డి, ప్రస్తుత వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. అలాగే ఆ సీటు ఆశించిన శివశంకర్ రెడ్డి అని సీబీఐ తన దర్యాప్తులో అభియోగాలు మోపిందని అంటున్నారు.
కానీ ఈ కేసులో కీలకమైన అనేక విషయాలను విస్మరించింది అని వైర్ కధనం పేర్కొంటోంది. తనను ఓడించారన్న కోపంతో వైఎస్ వివేకా అవినాష్ రెడ్డి భాస్కరరెడ్డిలని పరుషంగా నిందించారని, దాంతో వారు కోపం పెంచుకుని హత్య చేశారన్నట్లుగా దర్యాప్తు సాగడం కూడా అంత అతకలేదని వైర్ కధనం పేర్కొంటోంది.
ఇక కడప టికెట్ వివేకా ఆశించారు అంటే అప్పటికే సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారన్న విషయాన్ని కూడా సీబీఐ దర్యాప్తు విస్మరించిందని, పైగా ఆయన లక్షల ఓట్ల మెజారిటీతో 2014, 2019లలో గెలిచారు అన్నది కూడా గుర్తు చేస్తూ ఈ కధనం సాగింది.
ఇక వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో అనేక ఇతర కోణాలను కూడా సీబీఐ దర్యాప్తు స్పృశించలేదని అంటున్నారు. అవేంటి అంటే ఆయనతో 2011 నుంచి కుమార్తె సునీత అంటీముట్టనట్లుగా ఉండడం, వివేకాకు రెండవ పెళ్ళి షమీం తో జరగడం ఒక కుమారుడు ఉండడం వంటి వాటితో హత్యకు వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు కారణం అయ్యాయన్న కోణంలో విచారణ జరగలేదని అంటున్నారు.
మరో వైపు చూస్తే వైఎస్సార్ మరణాంతరం ఆయన రాజకీయ వారసత్వం కోసం వివేకాను ముందు పెట్టి ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా ప్రయత్నం చేశారని అప్పట్లో జగన్, విజయమ్మల రాజీనామాలతో ఖాళీ అయిన కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే సీట్లలో ఏదో ఒక దానికి పోటీ చేయడానికి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సిద్ధపడ్డారని, దాంతో సోనియా గాంధీని కలిసే ప్రయత్నం చేశారని, ఆమె అపాయింట్మెంట్ ఇవ్వలేదని కూడా కొత్త కధనాని వైర్ రాసుకొచ్చింది.
ఇక వివేకాకు హార్ట్ సర్జరీ జరిగిదని ఆ సమయంలో ఆయన పులివెందులలో ఉంటే భార్య హైదరాబాద్ లో ఉండేవారని, కుమార్తె సునీత కూడా అపుడపుడు వచ్చీ పోతూ ఉండేవారు అని కూడా వైర్ కధనంలో ఉంది. పైగా షమీం ని వివేకా రెండవ వివాహం చేసుకోవడం, కుమారుడు జన్మించడం తో కుటుంబంలో గొడవలు జరిగాయని, అవి ఎందుకు సీబీఐ విచారణలో లేవని వైర్ కధనం ప్రశ్నిస్తోంది.
అదే విధంగా చూస్తే ఈ కేసులో కేవలం రాజకీయ కోణాన్ని చూస్తూ దర్యాప్తు సాగించారని, కానీ చివరికి ఏమీ తేలక ఒక ముగింపునకు రాలేనిదిగా ఈ కేసు ఉందని వైర్ కధనం పేర్కొంది. మొత్తానికి చూస్తే నాలుగేళ్ళకు పైగా సుదీర్ఘ కాలంలో సీబీఐ సాధించింది శూన్యమని ఆ వెబ్ సైట్ లో పేర్కొనడం విశేషం.
ఇక వివేకా హత్య కేసు దర్యాప్తు అంతా మొత్తం ఒకే కోణంలో సాగిందని ఆయన హత్యకు వేరేకారణాలు ఉండొచ్చన్న భావన కూడా సీబీఐకి రాలేదంటూ ఆ వెబ్ సైట్ అనేక రకాలైన ప్రశ్నలు సంధించింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కేసులో సీబీఐ ఒక వైపే ఎందుకు చూడాల్సి వచ్చిందని కూదా సీబీఐ తీరును ఆ వైర్ వెబ్ సైట్ ఆక్షేపించింది.
ఇక రాజకీయ కారణాలతో హత్య జరగలేదు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని వెబ్ సైట్ పేర్కొంది. నిజానికి చూస్తే కడప ఎంపీ టికెట్ కోసం ఈ హత్య జరిగింది అన్నట్లుగా సీబీఐ వాదన ఉంటోంది. కానీ అప్పటికే కడప టికెట్ అవినాష్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకటించేసారు. అంతేకాదు ఆ ప్రకటన వచ్చాక సైతం వివేకా అవినాష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసారు. ఆ విషయాన్నీ సీబీఐ అసలు పట్టించుకోనేలేదు అని వెబ్ సైట్ అంటోంది.
ఇక రాజకీయ కారణాలతో హత్య అని చెప్పినా వాటిని ఎస్టాబ్లిష్ చేసే ఒక్క ఆధారాన్ని కూడా ఈ కేసులో సీబీఐ సంపాదించిందా అన్నదే వెబ్ సైట్ కధనం ప్రశ్నగా ఉంది. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి బలమైన అభ్యర్థి కాదని వివేకా భావించారు అంటూ వైయస్ షర్మిల గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని తీసుకుని ముందుకు వెళ్లిన సీబీఐ అసలు అవినాష్ ట్రాక్ రికార్డ్ గుర్తించలేదు. 2014లో 1. 90 వేల ఓట్ల మెజారిటీ ఇంకా 2019లో 3. 80 లక్షల మెజారిటీతో గెలిచారు. అయన మెజారిటీ పెరిగిందే తప్ప తగ్గలేదు. మరి అలాంటపుడు అవినాష్ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేకా ఎలా భావిస్తారు. ఈ పాయింట్ ఎందుకు సీబీఐ మర్చిపోయింది అన్నది వెబ్ సైట్ కధనంలో వెల్లడించిన సందేహం.
మరో వైపు హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చనే కోణం ఎందుకు సీబీఐ తీసుకోలేదు. హత్యకు ఏయే కారణాలు ఉండొచ్చన్న సందేహాలు సీబీఐ మదిలో మెదిలి, ఇలా పలుకోణాల్లో విచారణ జరపాల్సి ఉండగా సీబీఐ అదేమీ పట్టించుకోకుండా కేవలం ఒకే కోణంలో అది కూడా అవినాష్ కు అందులో పాత్ర ఉందన్న విషయాన్నీ నిరూపించడానికి ఎక్కువ తాపత్రయపడింది అన్న దాని మీద కూడా వెబ్ సైట్ కధనం అనుమానాలను వ్యక్తం చేసింది. ఇలా పలు కీలక అంశాలు వదిలేసి ఎటెటో దర్యాప్తు బృందం వెళ్ళిపోయి ఏమీ సాధిచకుండా నాలుగేళ్లు గడిపేసింది అంటూ సీబీఐని ది వైర్ వెబ్ సైట్ కధనం ఘాటుగానే విమర్శించింది.