వైసీపీ లీడర్లను ఎప్పటి నుంచి టార్గెట్ చేద్దాం ? కూటమి ఆలోచన !?

వైసీపీ భారీ ఓటమితో పాతాళానికి జారి ఉంది. అసలు ఉలుకూ పలుకూ లేకుండా ఉంది.

Update: 2024-06-27 15:30 GMT

వైసీపీ భారీ ఓటమితో పాతాళానికి జారి ఉంది. అసలు ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. అయిదేళ్ల పాటు అధికారం చలాయించిన పార్టీ ఇపుడు చూస్తే ఎక్కడా అన్నట్లుగానే ఉంది. అదే సమయంలో ఎన్నడూ కనీ వినీ ఎరగని అద్భుతమైన మెజారిటీతో టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ప్రమాణం చేసింది. మంత్రులు చార్జ్ తీసుకున్నారు

ఇపుడిపుడే పాలన వైపుగా అంతా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయిదేళ్ళుగా తమను నానా విధాలుగా ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను గట్టిగా టార్గెట్ చేస్తారని అంటున్నారు. అయితే అది ఎపుడూ అన్న చర్చ వస్తోంది. దానికి కూడా ముహూర్తం ఉందా అంటే పాలిటిక్స్ లో టైం చాలా ఇంపార్టెంట్. టైం చూసి కొడితేనే రిజల్ట్ పాజిటివ్ గా వస్తుంది. దాంతో కూటమి పెద్దలలో ఇపుడు దాని మీదనే పెద్ద చర్చ సాగుతోంది అని అంటున్నారు.

వైసీపీ అయిదేళ్ళ పాలన పూర్తిగా అక్రమాలు అవినీతితో నిండిపోయాయని కూటమి నేతలు కానీ మంత్రులు కానీ ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. ముఖ్యంగా గనులు ఇసుక, లిక్కర్ వంటి వాటిలో భారీ స్కాం జరిగిందని కూడా బలంగా నమ్ముతున్నారు. ఈ మూడు రంగాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని వేలాది కోట్ల రూపాయలను దోచుకున్నారు అని కూటమి సర్కార్ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది అని అంటున్నారు.

దానికి తోడు ఆధారాలు కూడా రెడీగా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో బోణీ ఎక్కడ నుంచి కొట్టాలి, ఎవరి నుంచి మొదలెట్టాలి అన్న దాని మీదనే కూటమి ప్రభుత్వ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు అని అంటున్నారు. మొదలు పెడితే తొలి షాట్ అదిరిపోవాలని దెబ్బకు కూసాలు కదలాలని కూడా భావిస్తున్నారుట.

Read more!

జనాలకు కూడా అంతా తేటతెల్లంగా కనిపించాలని ఇది కేవలం కక్ష సాధింపు కానే కాదు ఖజానా సొమ్ముకు లెక్క చెప్పే పవిత్ర బాధ్యత అని అంతా అనుకునేలా చేయాలని చూస్తున్నారుట. ఇదిలా ఉంటే స్వచ్చాంధ్రా కార్పోరేషన్ నిధులు వేలలో ఉండాల్సినవి జస్ట్ ఏడు కోట్లు మాత్రమే ఉండడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షాక్ తిన్న సంగతి తెలిసిందే.

కేంద్రం స్వచ్చాంద్రా కార్పొరేషన్ కి ఇచ్చిన వేయి కోట్ల రూపాయలు ఏమయ్యాయని పవన్ అధికారులను నిగ్గదీశారు. అయితే ఆ నిధులు ఆర్ధిక శాఖ ట్రాన్స్ ఫర్ చేయలేదని వాళ్లీ వాడుకున్నారు అని అధికారులు జవాబు చెప్పినట్లుగా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. దీంతో సమగ్రమైన నివేదికను పవన్ ఈ అంశం మీద కోరారు. అది వచ్చిన మీదట పవన్ ఏ రకంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

ఇలా వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి ప్రతీ రివ్యూలో కనిపిస్తోంది. వీటి మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీని వేసి భారీ విచారణకే పూనుకుంటారు అని తెలుస్తోంది. అదే విధంగా లిక్కర్ పాలసీ విషయంలో కూడా అవకతవకలు జరిగాయని లిక్కర్ స్కాం ఆషామాషీగా చూడాల్సింది కాదని అంటున్నారు. దాంతో లిక్కర్ స్కాం విషయంలో మొదట ఆడిటింగ్ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ఇక మైన్స్ విషయంలో చూస్తే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అంటున్నారు. ఇలా గనుల కుంభకోణం లోని ఘనులను బయటకు లాగితే మరి వైసీపీ ఎక్కడా లేవకుండా చేయవచ్చు అని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారుట.

4

మొత్తం మీద చూస్తే వైసీపీ అయిదేళ్ళ పాలనలో అణువణువూ అవినీతి రాజ్యమేలింది అని కూటమి ప్రభుత్వం స్థూలంగా అంచనాకు వచ్చింది. అలాగే ప్రభుత్వంలో ఉన్నందున ఒక్కో దానిని జాగ్రత్తగా బయటకు తీసే పనిలో ఉన్నారుట. ఎక్కడా ఎవరూ తప్పించుకోకుండా గట్టిగా పకడ్బందీగా యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారుట.

ఈ దెబ్బకు ఫ్యాన్ పార్టీ రెక్కలు ఊడడం ఖాయమని కూడా లెక్క వేసుకుంటున్నారుట. ఖజనాకు కన్నం పెట్టిన మహానుభావులలో ముందు ఎవరి వంతు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. బోణీ కుదిరితే వైసీపీ అవినీతి అక్రమాలు ఒక్కోటి బయటకు వస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News