ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఆస్తులు, ఆదాయం ఎంతో తెలుసా?

అవును... జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో రూ.50 లక్షల ఖరీదైన వాచ్ ధరించినట్లు ఫోటోల్లో కనిపించింది.

Update: 2024-08-13 07:07 GMT

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒలింపిక్ క్రీడల్లో అత్యంత క్రేజ్ ఉన్న భారత అథ్లెట్లలో నీరజ్ చోప్రా ఒకరనే చెప్పాలి. జావెలిన్ త్రోలో వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించాడు. ఈ క్రమంలో ఇతని ఆస్తులు, ఆదాయం పై చర్చ మొదలైంది.

అవును... జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో రూ.50 లక్షల ఖరీదైన వాచ్ ధరించినట్లు ఫోటోల్లో కనిపించింది. ఈ నేపథ్యంలోనే అతని ఆస్తి, సంపాదన ఎంతనే చర్చ మొదలైంది. అయితే... ఎకనామిక్ టైమ్స్ ప్రకారం నీరజ్ చోప్రా నికర ఆస్తుల విలువ సుమారు రూ.37 కోట్లు. కాగా.. నెలకు సగటున రూ.30 లక్షలు సంపాదిస్తారని అంటున్నారు.

ఇదే సమయంలో.. ఏడాదికి సుమారు రూ.4 కోట్ల వరకూ ఆదాయం అని తెలుస్తోంది. మరోపక్క ఈ ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించినందుకు పలు సంస్థలు భారీగా రివార్డులు అందజేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో 2021 టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించినప్పుడు ప్రభుత్వం అతడికి రూ.6 కోట్లు నగదు బహుమతి ప్రకటించింది.

మరోపక్క ఒలింపిక్స్ పోటీలు ముగిసిన అనంతరం నీరజ్ స్వదేశానికి రాకుండా జర్మనీకి బయలుదేరాడు. గాయానికి ఆపరేషన్ కు సంబంధించి వైద్య సలహా తీసుకొవడంతోపాటు.. రాబోయే డైమండ్ లీగ్ ల్లో పాల్గొనే విషయంపైనా నిర్ణయించుకోవడానికి అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు. అతడు స్వదేశానికి రావడానికి కనీసం 45 రోజులు పట్టొచ్చని అంటున్నారు.

కాగా.. డైమండ్ లీగ్ ఫైనల్ సెప్టెంబర్ 14న బెల్జియంలోని బ్రసెల్స్ లో జరగనుంది. అయితే ఈ ఫైనల్ లో ఆడాలనుకుంటున్నట్లు నీరజ్ ఇటీవల ప్రకటించాడు. ఇక ఈ సీజన్ లో మే 10న దోహాలో జరిగిన డైమండ్ లీగ్స్ లో ఆడాడు. ఈ లీగ్ ఫైనల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఏడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడు ఫైనల్స్ ఆడాలంటే మరో డైమండ్ లీగ్ లో ఆడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News