నెల్లూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థి 25 కోట్లకు అమ్ముడు పోయారా..?

వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా నెల్లూరు. 2014లో కూడా మెజారిటీ సీట్లు ఈ జిల్లా వైసీపీకి కట్టబెట్టింది.

Update: 2024-05-21 15:30 GMT

వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా నెల్లూరు. 2014లో కూడా మెజారిటీ సీట్లు ఈ జిల్లా వైసీపీకి కట్టబెట్టింది. 2019లో అయితే ఏకంగా పదికి పది ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు కూడా వైసీపీ గెలుచుకుంది అంటే జిల్లా మీద వైసీపీకి ఉన్న పట్టు ఏంటో తెలుస్తుంది. అటువంటి నెల్లూరు జిల్లాలో 2024 ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న టెన్షన్ ఆ పార్టీతో పాటు ఉత్కంఠ అయితే అందరిలోనూ ఉంది.

నెల్లూరు జిల్లాలో ఈసారి ఎన్నికలో హోరాహోరీగా సాగాయి. పోలింగ్ జరిగి కూడా వారం పై దాటిపోయింది. ఇప్పుడు మెల్లగా అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో పెద్ద రెడ్లు ఉంటారని ప్రపంచం మొత్తానికి తెలుసు. నెల్లూరు జిల్లా అంటేనే పెద్ద రెడ్లుగా చెప్పుకుంటారు.

అయితే ఈ జిల్లాలో ఇపుడు ఒక హాట్ హాట్ వార్త గుప్పుమంటోంది. అది గుసగుసల స్థాయి దాటి మరీ బాంబులా పేలుతోంది. ఇంతకీ ఏంటి అంటే ఎన్నికల ముందు రోజు వరకూ ప్రత్యర్ధి మీద దుమ్మెత్తి పోస్తూ వీర లెవెల్ లో విమర్శలు చేసిన ఒక వైసీపీ అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థి తీరా ఎన్నికల వేళకు కాస్తా ముందునే టీడీపీ అభ్యర్ధికి ఇరవై అయిదు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారు అని టాక్ అయితే అంతటా గట్టిగా వినిపిస్తోంది.

దీంతో ఎలక్షన్ అంత్తా తూతూ మంత్రంగా జరిపించేసి సైలెంట్ అయిపోయారు అని అంటున్నారు. లేట్ గా అయినా లేటెస్ట్ గా ఈ న్యూస్ బయటకు రావడంతో వైసీపీలో కలవరం మొదలైంది అని అంటున్నారు. ఈ తెలివైన అభ్యర్ధి ఏమి చేశారు అంటే జగన్ ఎన్నికల ఖర్చు కోసం ఇచ్చిన నలభై కోట్లతో పాటు టీడీపీ అభ్యర్థి ఇచ్చిన పాతిక కోట్లను జాగ్రత్తగా జేబులో పెట్టుకుని సీరియస్ గా చేయాల్సిన ఎన్నికలను లైట్ తీసుకున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది.

దీంతో ఎవరా అభ్యర్ధి ఏమా నియోజకవర్గం ఏమిటి కధ అన్న చర్చ మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటి అంటే వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీలోకి చేరిన ఒక బడా నేత నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీని పొలిటికల్ గా పెను సవాల్ చేశారు అని అంటున్నారు. ఆయన రాజకీయ జీవితం అంతా వైసీపీ కావడం విశేషం. ఎన్నికల ముందు వరకూ ఉన్న పార్టీ కావడంతో ఆయన ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్ళినా వైసీపీ లోగుట్టు బాగా ఎరుక కాబట్టి అవతల వైపు నుంచి ఆపరేషన్ సులువుగానే సాగింది అని అంటున్నారు.

దీంతో వీక్ నెస్ ఎవరికి ఏమిటి అన్నది కనిపెట్టి ఈ విధంగా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో చేసిన పొలిటికల్ జిమ్మిక్స్ వల్ల ఏకంగా వైసీపీ ఎంపీ అభ్యర్థికి పెద్ద ఎత్తున మైనస్ జరిగింది అని అంటున్నారు. అంటే ఇక్కడ అనుసరించిన విధానం ఏంటో తెలియదు కానీ క్రాస్ ఓటింగ్ చేశారా లేక ఒక ఓటు అటూ ఒక ఓటు ఇటూ అని చెప్పారా లేక రెండు ఓట్లూ వదిలేసుకున్నారా అన్నది లోతైన అధ్యయనం చేస్తే కనుక తెలియదు అంటున్నారు.

ఏది ఏమైనా ఈ బాంబు లాంటి వార్త ఇపుడు బయటపడడంతో వైసీపీలో విజయావకాశాల మీద చర్చ ఒక రేంజిలో సాగుతోంది. నెల్లూరు జిల్లా కంచుకోట బద్ధలు కొడితే రేపటి రోజున పార్టీకి పూర్తిగా ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్నారు. మరి ఆ అమ్ముడు పోయిన వారు ఎవరూ ఏమిటీ అన్నది లోగుట్టు పెరుమాళ్ళకు కాదు అయిన వాళ్ళకూ బాగా తెలుసు అని అంటున్నారు.

Tags:    

Similar News