తెలంగాణలో కొత్త చర్చ... టీడీపీ - బీజేపీ పొత్తు?

ఈ నేపథ్యంలో... సపోజ్ టీడీపీ - బీజేపీలో తెలంగాణలో కలిసి పోటీ చేస్తే... వీరిద్దరితోనూ పొత్తులో ఉన్నట్లు చెబుతున్న పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న.

Update: 2023-10-14 10:21 GMT

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచీ తెలంగాణ రాజకీయాలు మరీ వేడెక్కిపోతున్నాయి. ఇప్పటికే అధికార బీఆరెస్స్ అభ్యర్థులను ప్రకటించేసింది.. ఆదివారం నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావం మొదలుపెట్టబోతున్నారు. ఇదే సమయంలో మేనిఫెస్టో కూడా ప్రకటించ బోతున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ కోసం తలమునకలైంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా వెళ్తుందా.. లేక, టీడీపీతో పొత్తులో వెళ్తుందా అనే చర్చ తాజాగా పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది!

అవును... కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ లో ఉన్న బీజేపీ, ఈసారి తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తుంది. ఇందులో భాగంగా... ఒంటరిగా వెళ్తే కాస్త కష్టమనే ఫలితాలు సర్వేలలో వచ్చాయని అంటున్నారు. ఈ సమయంలో మంచో చెడో, కష్టమో సుఖమో టీడీపీతో కలిసి జతకడితే బెటరనే ఆలోచనలు పలువురు నేతలు చేస్తున్నారని అంటున్నారు.

మరోపక్క ఈ ప్రపోజల్ కు తెలంగాణలోని పలువురు బీజేపీ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారని తెలుస్తుంది. అయితే ఎవరు అవున్నా, ఎవరు కాదన్నా... అల్టిమేట్ గా అది అధిష్టాణం నిర్ణయం కాబట్టి అదే పరిగణలోకి తీసుకోబడుతుందనేది తెలిసిన విషయమే. మరోపక్క అమిత్ షా తో లోకేష్ భేటీ అనంతరం... దేనికైనా రెడీ అనే సంకేతాలు ఇచ్చారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. కారణం... ఇప్పుడు బీజేపీతో స్నేహం టీడీపీకి అత్యవసరం అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుండటమే!

ఈ నేపథ్యంలో... సపోజ్ టీడీపీ - బీజేపీలో తెలంగాణలో కలిసి పోటీ చేస్తే... వీరిద్దరితోనూ పొత్తులో ఉన్నట్లు చెబుతున్న పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న. ఇప్పటికే 32 స్థానాల్లో పోటీచేస్తామని జనసేన నేతలు నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరితో జనసేన కూడా పోటీచేస్తే కాస్త బెటర్ ఫలితాలు రావొచ్చనే ఆలోచనలో బీజేపీ కూడా ఉందని అంటున్నారు.

మరి అల్టిమేట్ గా బీజేపీ అధిష్టాణం పెద్దలు పొత్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటార అనేది వేచి చూడాలి. అయితే పొత్తులు ఫిక్సయితే మాత్రం ఇప్పటికే కర్చీఫులు వేసుకున్న బీజేపీ నేతలు, టీడీపీ సీనియర్లలో ఎవరో ఒకరు త్యాగాలు చేయక తప్పదనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఉదాహరణకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రస్థావిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న కామెంట్ల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనకున్న సమాజిక సమీకరణాలు, పార్టీ పరిస్థితులు, స్థానిక పరిస్థితుల మేరకు ఆయన ఈ నిర్ణయానికొచ్చినట్లు చెబుతున్నారు.

మరోపక్క బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీకి సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ టీడీపీ - బీజేపీ పొత్తులు కుదిరితే ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పని పరిస్థితి అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి వస్తున్న కథనాలు, జరుగుతున్న చర్చలకు తగ్గట్లుగా టీడీపీ - బీజేపీలో తెలంగాణలో కలిసి పోటీ చేస్తాయా.. లేక, మీకు మీరే మాకూ మేమే అంటూ ముందుకు వెళ్తాయా అన్నది వేచి చూడాలి!

Tags:    

Similar News